“రాధేశ్యామ్” ట్రైలర్ రిలీజ్..ప్రభాస్ ఫ్యాన్స్ కు పూనకాలే! (వీడియో)

0
43

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్, పూజాహేగ్దే జంటగా నటించిన సినిమా ‘రాధేశ్యామ్’. రాధాకృష్ణ కుమార్ దర్శకత్వం వహించిన ఈ సినిమాను గోపీకృష్ణ మూవీస్‌, యూవీ క్రియేషన్స్‌ సంస్థలు సంయుక్తంగా నిర్మిస్తున్నాయి.

మార్చి 11న ఈ చిత్రం థియేటర్లలోకి రానుంది. ఈ నేపథ్యంలో ప్రమోషన్స్ ను మొదలుపెట్టింది. ఇప్పటికే విడుదలైన పోస్టర్స్, సాంగ్స్ ఆకట్టుకున్నాయి. అయితే తాజాగా ఈ సినిమా నుంచి అదిరిపోయే అప్డేట్‌ వచ్చింది. రాధేశ్యామ్ నుంచి సెకండ్‌ ట్రైలర్ ను విడుదల చేసింది చిత్ర బృందం.

https://www.youtube.com/watch?v=NqJLkWBPShY

ఇక ఈ ట్రైలర్ లో… భవిష్యత్తు చెప్పే ఓ జ్యోతిష్కుడిలా ప్రభాస్ కనిపించాడు. అందరి చేతి రాతలు చూస్తూ… వారి భవిష్యత్తును చెప్పే పాత్రలో ఒదిగి పోయాడు ప్రభాస్. ముఖ్యంగా మొదటి ట్రైలర్ కంటే.. ఇవాళ విడుదలైన ట్రైలర్స్ సినిమాపై భారీగా అంచనాలు పెంచేసింది.