పనస పండు తిన్నాక వీటిని తింటున్నారా? తస్మాత్ జాగ్రత్త..!

0
40

పండ్లు అంటే ఇష్టం లేనివారు ఉండరు. చాలా మంది పనసని ఇష్టపడుతూ ఉంటారు. పనస పండుని తినొచ్చు లేదంటే పనసకాయ కూర చేసుకుని కూడా తీసుకోవచ్చు. అయితే పనసకాయని కానీ పనస పండును కానీ తీసుకునేటప్పుడు వీటిని అస్సలు తీసుకోవద్దు. మరచిపోయి కూడా వీటి జోలికి వెళ్లొద్దు. ఎందుకంటే వీటి వల్ల సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుంది అయితే పనస తిన్నాక ఏమేమి తినకూడదు..? వేటికి దూరంగా ఉండాలి అనేది ఇప్పుడు చూద్దాం.

పాలు:

పాలు ఆరోగ్యానికి మేలు చేస్తాయి. కానీ పనస తీసుకున్న తర్వాత పాలు తాగడం వల్ల ఆరోగ్యం ఇబ్బందుల్లో పడుతుంది. దురదలు కలగడం, సోరియాసిస్, రింగ్ వార్మ్ సమస్యలు కలిగే అవకాశం ఉంటుంది. కాబట్టి పనసని తీసుకున్నాక పాలను తీసుకోవద్దు.

బొప్పాయి:

పనసను తిన్నాక బొప్పాయి కూడా తీసుకోవద్దు. దీని వల్ల కూడా ఇబ్బందులు వస్తాయి.

బెండకాయ:

మీరు కనుక పనస కాయను తీసుకున్నట్లయితే వెంటనే బెండకాయ తినద్దు. చర్మ సమస్యలు కలిగే అవకాశం ఉంటుంది. కాబట్టి పనసకాయ తీసుకునేటప్పుడు వీటి జోలికి వెళ్లకుండా ఉండండి.

తేనె:

తేనే పనస కలిపి తీసుకోవడం వల్ల ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది. బ్లడ్ షుగర్ లెవెల్స్ ని ఇది బాగా పెంపొందిస్తుంది కాబట్టి ఈ రెండింటినీ కూడా వెంటవెంటనే తీసుకోవద్దు.

పాన్:

మామూలుగా మనం ఏదైనా ఆహారం తిన్నాక పాన్ ని తీసుకుంటూ ఉంటాము. కానీ పనసని తీసుకున్నాక పాన్ తీసుకుంటే ఆరోగ్య సమస్యలు వస్తాయి.