సిద్దిపేట జిల్లా రాఘవపూర్‌లో నిర్వహించిన బీఆర్ఎస్ ఆత్మీయ సమేళనంలో మంత్రి హరీశ్ రావు(Minister Harish Rao) భావోద్వేగానికి గురయ్యారు. ఇంత ఆదరాభిమానాలు చూస్తుంటే నాకు దుఃఖం వస్తుంది. ఇంత ఉత్సాహం చూస్తుంటే నాకు ఆనందంగా ఉందని ఎమోషనల్ అయ్యారు. నా చివరి శ్వాస వరకు మీకు సేవ చేస్తా అన్నారు. అంతేగాక, నా చర్మం వొలిచి మీకు చెప్పులు కుట్టించినా తక్కువే అంటూ మంత్రి హరీష్ రావు ఎమోషనల్ అయ్యారు. మీ దయ ముఖ్యమంత్రి కేసీఆర్ దయ వల్ల ఆరోగ్య శాఖ మంత్రిగా ఉన్నానన్నారు.
ప్రధాని మోడీ వచ్చి రాష్ట్ర ప్రభుత్వంపై బురద చల్లే ప్రయత్నాలు చేశారని మండిపడ్డారు. కేంద్ర ప్రభుత్వానికి రాష్ట్రం సహకరించడం లేదని మోడీ అంటున్నారని.. మరి తెలంగాణకు రైల్వే కోచ్ ఫ్యాక్టరీ ఎందుకు ఇవ్వడం లేదని ప్రశ్నించారు. తెలంగాణకు ఒక్క మెడికల్ కాలేజీ ఇవ్వలేదన్నారు. తెలంగాణ అభివృద్ధి చెందకుండా బీజేపీ అడ్డుకుంటోందని విమర్శించారు. ఉత్తరప్రదేశ్లో బీజేపీ డబుల్ ఇంజన్ ప్రభుత్వం ఉందని.. కానీ అక్కడ ఇప్పటికీ కరెంట్ లేక 20 లక్షల ఆయిల్ ఇంజన్లు నడుస్తున్నాయని హరీష్(Minister Harish Rao) ఎద్దేవా చేశారు.
Read Also: సెలబ్రిటీలు ఐఫోన్ ఎందుకు వాడతారో తెలుసా?
Follow us on: Google News, Koo, Twitter