ఎంపీ గల్లా జ‌యదేవ్ పై మిథున్ రెడ్డి స‌టైర్ ఇంత‌మాట అనేశారే?

ఎంపీ గల్లా జ‌యదేవ్ పై మిథున్ రెడ్డి స‌టైర్ ఇంత‌మాట అనేశారే?

0
82

ఏపీ రాజ‌ధాని అంశం పెద్ద ఎత్తున చ‌ర్చ‌కు కార‌ణం అవుతోంది.. అయితే ఈ విష‌యంలో మూడు రాజ‌ధానుల నిర్ణ‌యం నుంచి వెన‌క్కి రావాలి అని అమ‌రావ‌తిని కొన‌సాగించాలి అనితెలుగుదేశం పార్టీ కోరుతోంది కాని దీనిపై ముందుకు వెళ్లాలి అని వైసీపీ భావిస్తోంది ఏకంగా పార్ల‌మెంట్ లో కూడా దీనిపై గ‌ళం విప్పుతాం అంటున్నారు.

కాని తాజ‌గా కేంద్రం కూడా రాజ‌ధాని విష‌యంలో తాము జోక్యం చేసుకోము అని తెలిపారు, అయితే తాజాగా ఎంపీ గ‌ల్లా జ‌యదేవ్ అలాగే ఎంపీ మిథున్ రెడ్డి మ‌ధ్య మాటల యుద్ధం నడుస్తోంది. ఎంతో ప్రతిష్ఠాత్మకమైన ఫ్రాంక్లిన్ టెంపుల్టన్ సంస్థను డమ్మీ కంపెనీగా అభివర్ణించడం అవివేకమని గల్లా జయదేవ్ ట్వీట్ చేశారు.

దీనికి ట్వీట్ తో బ‌ధులు ఇచ్చారు మిథున్ రెడ్డి….నీకు తలమీద వెంట్రుకలే లేవనుకున్నా, ఇప్పుడర్థమవుతోంది నీకు తలలో మెదడు కూడా లేదని. పెట్టుబడిదారులను ఏపీకి రాకుండా చేయాలని ఎందుకంత హడావుడి చేస్తున్నావు? అజ్ఞాని, అవివేకి అని ఎవర్నంటున్నావు? అది నువ్వే” అంటూ మిథున్ రెడ్డి ఘాటుగా స్పందించారు.

కియా మోటార్స్ వాళ్లు మేం ఏపీ దాటి వెళ్లట్లేదు మొర్రో అంటుంటే నువ్వు పనిగట్టుకుని ఫేక్ న్యూస్ ఎందుకు ప్రచారం చేస్తున్నావు? ఓ ఎంపీ ఎంత బాధ్యతగా వ్యవహరించాలో నీకు తెలియదా? లేక నీ నుంచి అంత బాధ్యతను ఆశించడం సరికాదంటావా? అని ప్రశ్నించారు.

మొత్తానికి గ‌ల్లా జ‌య‌దేవ్ పై మిథున్ రెడ్డి వేసిన స‌టైర్ ఇప్పుడు సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అవుతోంది.