ఎమ్మెల్యే రోజాకు ఈనెలాఖరున గుడ్ న్యూస్

ఎమ్మెల్యే రోజాకు ఈనెలాఖరున గుడ్ న్యూస్

0
81

ఏపీ శాసనమండలి రద్దు అవుతుంది అనేది తెలిసిందే.. ఇక దీనిపై కేంద్రం ముందుకు వెళితే రాష్ట్రపతి నోటిఫై చేస్తే మండలి రద్దు అవుతుంది, అయితే బీజేపీ ఏం చేస్తుందా అనేది ఓ ఆలోచన, ఈ సమయంలో ఇద్దరు మంత్రులు తమ పదవులకి రాజీనామా చేయాల్సిన పరిస్దితి వచ్చింది.

అయితే వైసీపీ ఎమ్మెల్యే రోజాకు మాత్రం ఈ సమయంలో మంత్రి పదవి పక్కాగా ఇస్తారు అని తెలుస్తోంది, ఆమెకు మంత్రి పదవి వస్తుంది అని, ఒకరు కాదు ఇద్దరు కాదు వైసీపీ నేతలు అందరూ కూడా చర్చించుకుంటున్నారు.. ఈసారి సార్వత్రిక ఎన్నికల్లో ఎమ్మెల్యేలుగా పోటీ చేసి ఓడిపోయినా ఎమ్మెల్సీ కోటాలో పిల్లి సుభాష్ చంద్రబోస్, మోపిదేవి వెంకటరమణకు జగన్ మంత్రి పదవులను కట్టబెట్టారు.

సో మరి మండలి రద్దుతో వారు మంత్రి పదవులు కోల్పోతారు, ఈ సమయంలో కేబినెట్ లోకి మంత్రిగా రోజాకి అవకాశం ఇవ్వనున్నారట, అయితే గతంలో ఆమెకు మంత్రి పదవి అని వార్తలు వచ్చాయి. కాని ఒకే సామాజికవర్గం కావడంతో జిల్లా నుంచి ఆమెకు మంత్రి పదవి రాలేదు, ఇక ఏపీ అంతా ఆమె గురించి వార్తలు రావడంతో, కచ్చితంగా ఈసారి ఆమెకు మంత్రి పదవి ఇస్తారని మరో మంత్రి పదవి బీసీకీ దక్కుతుంది అంటున్నారు.