చిన జీయర్ స్వామిపై ఎమ్మెల్యే సీతక్క ఆగ్రహం (వీడియో)

0
89

చిన జీయర్ స్వామిపై ములుగు కాంగ్రెస్ ఎమ్మెల్యే సీతక్క ఫైర్ అయ్యారు. ఆదివాసీల ఇలవేల్పు సమ్మక్క సారక్కను అవమానించేలా దేవతల మీద దుర్మార్గంగా మాట్లాడారని, అయినా ఈ ఘటనపై సీఎం స్పందించకపోవడం బాధాకరం అన్నారు.

పేదల ఇళ్లకు వంద గజాల జాగ దొరకడం లేదు.. మీకు మాత్రం వందల ఎకరాల స్థలం ఎలా వస్తుందని ఫైర్ అయ్యారు. జీయర్ స్వామి ఏనాడైనా పేదల ఇళ్లకు వెళ్ళారా ? ప్రకృతి దేవతల దర్శనం ఉచితంగా ఉంటుందన్నారు ఎమ్మెల్యే సీతక్క. మా తల్లులది వ్యాపారమా, మా దేవతల దర్శనానికి ఒక్క రూపాయి కూడా టికెట్ లేదు కానీ కానీ మీరు మీరు పెట్టిన 120 కిలోల బంగారం గల సమతా మూర్తి విగ్రహం చూస్తానికి మాత్రం 150 రూపాయలు టికెట్ ధర పెట్టారు మీది బిజినెస్ మా సమ్మక్క సారలమ్మ తల్లి దగ్గర ఇలాంటి వ్యాపారం జరగదు.

లక్ష రూపాయల తీసుకోకుండా ఏదైనా పేద వారి ఇంటికి మీరు వెళ్ళారా ? తెలంగాణ ప్రభుత్వం వెంటనే రియల్ ఎస్టేట్ స్వామి అయినా చిన్న జీయర్ స్వామి చేసిన వ్యాఖ్యలపై స్పందించాలి తగిన బుద్ధి చెప్పాలని డిమాండ్ చేస్తూ వీడియో పెట్టారు సీతక్క.

వీడియో చూడడానికి కింది లింక్ ను క్లిక్ చేయండి

https://www.facebook.com/alltimereport/videos/448654800346032