మధు యాష్కీ గౌడ్ దొంగ సర్టిఫికెట్ల ముఠా నడిపేవాడు : సుధీర్ రెడ్డి ఫైర్

0
99

టిపిసిసి ప్రచార కమిటీ ఛైర్మన్ మధు యాష్కీ గౌడ్ పై విరుచుకుపడ్డారు కాంగ్రెస్ లో గెలిచి టిఆర్ఎస్ లో చేరిన ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్ రెడ్డి. గురువారం టీ ఆర్ ఎస్ నేత క్యామ మల్లేష్ తో కలిసి తెలంగాణ భవన్ లో ఆయన మీడియా సమావేశంలో మాట్లాడారు. ఆయన మాటల్లోనే..

పీసీసీ ప్రచార కమిటీ చైర్మన్ మధు యాష్కీ నా పై ప్రయోగించిన పరుష పదజాలాన్ని ఖండిస్తున్నాను. నాకు కాంగ్రెస్ లో పదవులు రావడానికి అక్కడ నేను అంకిత భావం తో పని చేయడమే కారణం. 36 యేండ్లు కాంగ్రెస్ లో పనిచేశా. కార్పేరేటర్ అయినాక 22 యేండ్లకు కాంగ్రెస్ లో ఎమ్మెల్యే టికెట్ వచ్చింది. మధు యాష్కీ అమెరికా నుంచి 2003 లో రాగానే కాంగ్రెస్ లో తక్కువ సమయానికే టికెట్ వచ్చింది.

మధు యాష్కీ అమెరికా లో ఎన్ని నేరాలు చేశారో నా దగ్గర చిట్టా ఉంది. సమయం వచ్చినపుడు విప్పుతా. దొంగ సర్టిఫికెట్ లతో అమెరికా కు జనాలను పంపే ముఠా ను నడిపింది యాష్కీ కాదా? అమెరికా లో అటార్నీ పరీక్షలు ఆరు సార్లు రాసి ఫెయిల్ అయ్యారు ..కానీ అటార్నీ అని చెప్పుకుంటారు. మధు యాష్కీ దొంగ చదువు సర్టిఫికెట్ గురించి తెలిసిందే. యాష్కీ జైలుకు పోక తప్పదు. నేను ఆయన నేరాల పై ఎక్కడైనా చర్చకు సిద్ధం. అమెరికా లో ఆరు నెలలు ఇక్కడ ఆరు నెలలు ఉండే యాష్కీ నా గురించి మాట్లాడుతారా ? యాష్కీ లాగా నేను మాట్లాడగలను. సంస్కారం అడ్డువస్తుంది.

ఎప్పటికైనా నేరాలు నిరూపించి యాష్కీ ని జైలుకు పంపి తీరుతా. న్యూ యార్క్ ఫెడరల్ కోర్ట్ లో జైలు శిక్ష ను తప్పించుకునేందుకు అక్కడ కాళ్ళ బేరానికి పాల్పడ్డాడు. నాకు కాంగ్రెస్ లో టికెట్ రాకుండా మధు యాష్కీ అడ్డుపడ్డారు. యాష్కీ లాంటి నేతల వల్ల కాంగ్రెస్ బ్రష్టు పట్టించారు. నిజామా బాద్ లో ఏ సెగ్మెంట్ లోనైనా యాష్కీ తో చర్చకు సిద్ధం. నకిలీ వీసాలతో అమెరికా కు పంపిన యాష్కీ ని కటకటాల పాలు చేస్తా. కాంగ్రెస్ నేతల చిట్టా చాలా ఉంది ..అందరి బండారం బయట పెడతా.

క్యామ మల్లేష్

మధు యాష్కీ నిజామాబాద్ లో డిపాజిట్ కోల్పోయారు. అలాంటి వ్యక్తా మా నేతలను విమర్శించేది ? బడుగు బలహీన వర్గాల్లో పుట్టి వారికి ద్రోహం చేసిన నేత యాష్కీ. మంత్రి సబిత మహిళ అని చూడకుండా విమర్శలు చేస్తావా ? మల్ రెడ్డి సోదరులు మామూళ్లు ఇస్తారు కాబట్టే యాష్కీ వాళ్ళ పేర్లు తీసుకున్నారు. డీ ఎస్ ,షబ్బీర్ అలీ లకు డబ్బులు ఇచ్చి అపుడు టికెట్ తెచుకున్న వ్యక్తి యాష్కీ. యాష్కీ ఓ బ్రోకర్ ..నకిలీ సర్టిఫికెట్ల దొంగ. యాదాద్రి గుడి కాళేశ్వరం ప్రాజెక్టులు కట్టి కెసిఆర్ వెయ్యేండ్లు ప్రజలు గుర్తుంచుకునే పని చేశారు. కాంగ్రెస్ నేతల మొహాలకు ఒక్క చిన్న గుడి ,చిన్న చెరువు కట్టనైనా కట్టారా ? పది పైసలకు కూడా పనికి రాని వాడు కూడా కే టీ ఆర్ ను తిడుతున్నారు. కే టీ ఆర్ కాలి గోటి కి కూడా వారు సరిపోరు. కాంగ్రెస్ కొత్త కమిటీ లొ కాంగ్రెస్ వాళ్లు లేరు.