మొబైల్ యూజ‌ర్ల‌కు ఇది పెద్ద షాక్

మొబైల్ యూజ‌ర్ల‌కు ఇది పెద్ద షాక్

0
83

క‌రోనా వైర‌స్ తో ఇప్పుడు అంద‌రూ ఇంటికి ప‌రిమితం అయ్యారు.. దీంతో వ‌ర్క్ ఫ్ర‌మ్ హోమ్ కూడా చాలా మంది చేస్తున్నారు..కొంద‌రు ఇంటిలో నెట్ పెట్టించుకుంటే మ‌రికొంద‌రు మొబైల్ డేటాతో వ‌ర్క్ చేస్తున్నారు.., దీంతో నెట్ వ‌ర్క్ కూడా చాలా మంది వినియోగిస్తున్నారు.

గ‌తంలో కంటే డేటా ప్యాక్స్ చాలా మంది రీచార్జ్ చేసుకుంటున్నారు, కొన్ని కంపెనీలు ఆఫ‌ర్లు ఇస్తున్నాయి. ఇదంతా ఒక ఎత్తు అయితే చాలా మంది ఇంటిలో ఉండటంతో గేమ్స్ అలాగే ఇంట‌ర్ నెట్ వాడ‌కం, చాటింగ్స్, పిల్ల‌ల వీడియోలు సినిమాలు ఇలా నెట్ వాడ‌కం గ‌తంలో కంటే 100 రెట్లు పెరిగింది.

దీంతో భారత్‌లో మొబైల్‌ ఇంటర్నెట్‌, హోం బ్రాడ్‌బ్యాండ్‌ స్పీడ్‌ వేగం కూడా తగ్గుతోంది.
ఫిబ్రవరిలో సరాసరిగా 39.65 ఎంబీపీఎస్‌గా ఉన్న డౌన్‌లోడ్‌ స్పీడ్‌ ఆ మరుసటి నెలకు గాను 35.98 ఎంబీపీఎస్‌కు పడిపోయింది. సరాసరి మొబైల్‌ నెట్‌వర్క్‌ వేగం కూడా 11.83 ఎంబీపీఎస్‌ నుంచి 10.15 ఎంబీపీఎస్‌కు త‌గ్గింది. ఇక ఆన్ లైన్ లో సినిమాలు వీడియోలు హెడ్ డీ క్వాలిటీ త‌గ్గించిన‌ట్లు స‌ద‌రు సంస్ద‌లు తెలిపిన విష‌యం తెలిసిందే.