మోదీ 2.0 ప్లాన్ ఏప్రిల్ 15 సంచ‌ల‌న నిర్ణ‌యం

మోదీ 2.0 ప్లాన్ ఏప్రిల్ 15 సంచ‌ల‌న నిర్ణ‌యం

0
87

ప్రధాని న‌రేంద్ర‌మోదీ దేశ వ్యాప్తంగా లాక్ డౌన్ వ‌చ్చే నెల అంటే మే 3 వ‌ర‌కూ పొడిగించారు, అయితే జోన్ల అంశం తెర‌పైకి తెచ్చి చాలా మందికి రిలీఫ్ ఇస్తారు అని అంద‌రూ భావించారు.. కాని ప్ర‌ధాని మాత్రం ఏప్రిల్ 20 త‌ర్వాత అది ఉంటుంది అనేలా తెలిపారు.

భారతావని చేస్తున్న పోరాటంలో లాక్ డౌన్ ను పొడిగించాలన్న ఆలోచన కేవలం ఓ గేమ్ చేంజర్ అని కేంద్ర మంత్రి ప్రకాశ్ జవదేకర్ వ్యాఖ్యానించారు. ఈ వైర‌స్ పోరుపై రేపు ప్ర‌క‌ట‌న ఉంటుంద‌ట‌, దీనిపై ఓ ప్ర‌ణాళిక చేశార‌ట అది రేపు ప్ర‌క‌టిస్తారు అని తెలుస్తోంది.

ఏప్రిల్ 20 తరువాత రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరించాల్సిన లాక్ డౌన్ వ్యూహంపైనా కేంద్రం నుంచి సలహాలు, సూచనలు అందుతాయని, ఆపై రాష్ట్రాల్లోని పరిస్థితులకు అనుగుణంగా, ఆయా ప్రాంతాల్లోని సౌలభ్యాల ప్రకారం నిర్ణయాలు తీసుకోవాలి అని చెప్పారు, మొత్తానికి రేపు ఎలాంటి ప్ర‌క‌ట‌న ఉంటుంది అనేది అంద‌రిలో ఆస‌క్తి ఉంది.