ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి తాజాగా తీసుకున్న మూడు రాజధానుల నిర్ణయం పై పెద్ద ఎత్తున రాజధానిలో రైతులు విమర్శలు చేశారు… అయితే తాజాగా విశాఖకు రాజధాని తరలి వెళ్లడం పై పెద్ద ఎత్తున విమర్శలు కూడా చేస్తున్నారు టీడీపీ నేతలు, అయితే తాజాగా ఈ విషయంలో జోక్యం చేసుకోవాలని ప్రధాని మోడీని కోరేందుకు ఢిల్లీకి రాజధాని రైతులు వెళుతున్నారు. అమరావతిలోనే రాజధాని ఉండేలా చూడాలని వారు డిమాండ్ చేస్తున్నారు.
అలాగే జనసేన టీడీపీ పెద్దఎత్తున రైతుల వెనుక ఉండాలి అని భావిస్తున్నాయి… అమరావతిని మార్చడం సులభం కాదు.. ప్రభుత్వం మారినప్పుడల్లా రాజధాని మారదని.. వైసీపీ ప్రభుత్వం ఇష్టమొచ్చినట్టు మారిస్తే కేంద్రంలోని బీజేపీ మౌనంగా ఉండదంటూ సుజనా చౌదరి ట్వీట్ చేశారు. దీనిపై జీవీఎల్ మాత్రం ఇది పూర్తిగా స్టేట్ ఇష్టం అని తెలియచేశారు.
తాజాగా బీజేపీ నేతల ద్వారా ప్రధాని మోదీని కలిసేందుకు రైతులు కొందరు నేతలు రెడీ అవుతున్నారు. అపాయింట్ మెంట్ తీసుకోగానే హస్తిన వెళ్లాలి అని చూస్తున్నారు.. మరి దీనిపై బీజేపీ ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో చూడాలి.