ఇప్పటికే మోడీ సర్కార్ ఎన్నో పథకాలను రైతుల కోసం తీసుకొచ్చారు. వీటిలో ముఖ్యంగా ప్రధాన మంత్రి కిసాన్ సమ్మాన్ నిధి యోజన పథకం ఒకటి. అలాగే పీఎం కిసాన్ యోజన, పీఎం ఫసల్ బీమా యోజన, పీఎం కుసుం యోజన, పీఎం కృషి సించాయి యోజన, పీఎం కృషి వికాస్ యోజన.. ఇలా ఎన్నో పథకాల ద్వారా చేయూతనందిస్తోంది.
వ్యవసాయ యంత్రాల కొనుగోలుపై సబ్సిడీ అందిస్తోంది కేంద్రం. ఈ క్రమంలో ట్రాక్టర్ల కొనుగోలుపై కూడా సబ్సిడీ ఇస్తోంది. ‘పీఎం కిసాన్ ట్రాక్టర్ యోజన’ కింద ఈ సబ్సిడీని ఇస్తున్నారు. రైతులు ఏ కంపెనీ ట్రాక్టర్లనైనా సగం ధరకే కొనుగోలు చేయవచ్చు. మిగిలిన సగం డబ్బును ప్రభుత్వం సబ్సిడీగా ఇస్తుంది.
20 నుంచి 50 శాతం వరకూ సబ్సిడీ ఇస్తున్నారు.రైతులు సొంత వ్యవసాయ భూమిని కలిగి ఉండాలి. భూమి పాస్ బుక్, బ్యాంక్ ఖాతా పాస్ బుక్, ఆధార్ కార్డు, ఫోన్ నెంబర్, పాస్ పోర్ట్ సైజు ఫొటో అవసరం. కామన్ సర్వీస్ సెంటర్‌కి వెళ్లి ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేయవచ్చు.