సీఎం జగన్ కు గుడ్ న్యూస్ చెప్పిన మోడీ సర్కార్

సీఎం జగన్ కు గుడ్ న్యూస్ చెప్పిన మోడీ సర్కార్

0
82

ఏపీ మూడురాజధానుల విషయంలో కేంద్రం మరోసారి క్లారిటీ ఇచ్చింది… రాజధాని వ్యవహారం రాష్ట్ర పరిధిలోనిదని తేల్చి చెప్పింది…ఇప్పటివరకు రాజధాని రైతులు ఏపీ విభజన చట్టంలో మూడు రాజధానుల ప్రస్తావనే లేదని వాదిస్తున్న నేపథ్యంలో దీనిపై మరింత స్పష్టతనిచ్చింది…

విభజన చట్టంలో పిటీషనర్లు అయిన రైతులు అపోహ పడుతున్నారని కేంద్రం తెలిపింది…అదే సమయంలో హైకోర్టు రాజధానిలోనే ఉండాలని చేస్తున్న వాదనలో అర్థం లేదని తెలిపింది… ఏపీలో రాజధాని ఏర్పటు విషయంలో కేంద్ర ప్రమేయం ఉండని చెప్పింది… రాష్ట్ర ప్రభుత్వం ఎంచుకున్న రాజధానికి అర్ధిక ఇతర సాయాలు చేయడం మాత్రమే తమ పరిధి అని స్పష్టం చేసింది…

రాజధాని విషయంలో కేంద్రం పాత్ర ఉండదని తెలిపింది.. రాజధాని విషయంలో కేంద్ర సహకరిస్తుందంటే ఒకే రాజధానికి కాదని ఒటికంటే ఎక్కువ రాజధానులు ఉంటే తామెక్కడ సాయం చేబోమని చెప్పలేదని తెలిపింది… దీనిబట్టి కేంద్రం మూడు రాజధానుల విషయంలో ఫుల్ క్లారిటీ ఇచ్చిందనే చెప్పాలి…