మోడీయే నెంబర్ వన్..మార్నింగ్ కన్సల్ట్ సర్వే సంస్ధ వెల్లడి

0
104

అమెరికాకు చెందిన ‘మార్నింగ్ కన్సల్ట్ ‘ అనే సంస్థ అధిక ప్రజామోదం ఉన్న నేత ఎవరో స్పష్టం చేసింది. ఈ సర్వేలో భారత ప్రధాని నరేంద్ర మోడీ తొలి స్థానంలో నిలిచారు. ఆయన పాలనకు 75 శాతం మంది ప్రజలు సానుకూలంగా ఓటేశారు. మొత్తం 22 మంది దేశాధినేతల్లో అత్యధిక రేటింగ్ సంపాదించుకున్నారు మోదీ.

అమెరికాకు చెందిన మార్నింగ్‌ కన్సల్ట్‌ అనే సంస్థ.. నిర్వహించిన ఈ సర్వేలో అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌ ఆరో స్థానానికి పరిమితం కావడం విశేషం. ఏంజెలా మెర్కెల్‌, జర్మనీ ఛాన్సలర్‌ 54 శాతం.. స్కాట్‌ మోరిసన్‌, ఆస్ట్రేలియా ప్రధాని 47 శాతం, జస్టిన్‌ ట్రూడో, కెనడా ప్రధాని 43 శాతం ప్రజామోదం పొందారు. ఫుమియో కిషిదా, జపాన్‌ ప్రధాని 42 శాతం, మూన్‌ జే-ఇన్‌- ద.కొరియా అధ్యక్షుడు 41 శాతం, బోరిస్‌ జాన్సన్‌, బ్రిటన్‌ ప్రధాని 40 శాతం ప్రజామోదం పొందారు.

స్పెయిన్‌ ప్రధాని పెడ్రో సాంచెజ్‌  37 శాతం ప్రజామోదం పొందగా… ఫ్రాన్స్ అధినేత ఇమ్మాన్యుయేల్‌ మెక్రాన్‌ 36 శాతం.. బ్రెజిల్‌ అధ్యక్షుడు  జైర్‌ బోల్సొనారో  35 శాతం ఆమోదంతో జాబితాలో చివరి స్థానాలకు పరిమితం అయ్యారు.