ఇస్రో చైర్మన్ కు మోడీ ఓదార్పు..!

ఇస్రో చైర్మన్ కు మోడీ ఓదార్పు..!

0
98

భారత అంతరిక్ష పరిశోధన సంస్థ అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపట్టిన చంద్రయాన్ 2 చివరి నిమిషంలో విఫలం కావడంతో బెంగళూరులోని ఇస్రో ప్రధాన కార్యాలయంలో ఒక్కసారిగా మౌనం రాజ్యమేలింది. భారత ప్రధాని మోదీ తో సహా ఇస్రో చైర్మన్, శాస్త్రవేత్త లందరూ బాబుది గానికి గురయ్యారు. మోడీ ప్రసంగం ముగిసిన అనంతరం మోదీ వద్దకు వెళ్లిన ఇస్రో చైర్మన్ శివన్ కంటతడి పెట్టుకున్నారు.

శివన్ ను దగ్గరకు తీసుకుని మోదీ ఘడంగా హత్తుకున్నారు. ఆయన వీపు నిమురుతూ ధైర్యం చెప్పారు. భవిష్యత్తులో ఇస్రో సాధించే విజయాలకు ఇది నాంది అని చెప్పారు. చంద్రుడి తాకాలనే మన ఆకాంక్ష ఇప్పుడు మరింత బలపడింది అని రాబోయే రోజుల్లో మనం ఘన విజయాలు సాధిస్తామని మోడీ అన్నారు.