అమెరికా అధ్యక్షుడు ట్రంప్ కొన్ని సార్లు మాట్లాడే తీరు వివాదాస్పాదం అవుతుంది ..ఇటీవలే భారత్ వచ్చి వెళ్లారు, అయితే తాజాగా ఈ కరోనా వైరస్ వ్యాప్తితో అతి దారుణంగా అమెరికా పరిస్దితి మారింది. అక్కడ కేసులు నాలుగు లక్షలకు చేరుకున్నాయి. ఇక మృతుల సంఖ్య వేలల్లో ఉంది.
ఈ సమయంలో అక్కడ పరిస్దితి చేయిదాటిపోయింది. ఈ సమయంలో కొవిడ్ 19 చికిత్స నిమిత్తం హైడ్రాక్సీక్లోరోక్విన్ మాత్రలు కావాలంటూ ట్రంప్ భారత్‌ను కోరారు. వాటిని తమకు అందించకపోతే భారత్ మీద ప్రతీకారం ఉండొచ్చని అన్నారు ట్రంప్. అయితే భారత్ ఈ మందుల ఎగుమతి ఆపేసింది.
మన దేశంలో కూడా కరోనా ప్రభావం ఉంది కాబట్టి మందులు అవసరం ఉంటాయి అని భావించారు, అయితే అమెరికాలో కూడా దారుణమైన స్దితి ఉండటంతో ఇప్పుడు మోదీ కూడా వాటిని పంపేందుకు అంగీకరించారు.. దీంతో మోదీ చర్యతో ట్రంప్ ఆనందించారు. గుజరాత్‌లోని కొన్ని పరిశ్రమల నుంచి షిప్‌మెంట్ ప్రారంభమైందని తెలుస్తోంది.భారత్ చేస్తున్న సాయంతో మోదీ గొప్పవారు. చాలా మంచివారు అని ప్రశంసించారు ట్రంప్..