మోడీ..కేసీఆర్ పై రేవంత్ రెడ్డి ఫైర్

Modi..Rewant Reddy fires on KCR

0
110

కేంద్ర బడ్జెట్ పై టిపిసిసి చీఫ్ రేవంత్ రెడ్డి తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. రైతులకు మేలు, యువకులకు ఉపాధి, మహిళలకు రక్షణ వేటికి ప్రధాన్యత లేదు. మోడీ బడ్జెట్ తో దేశానికి మేలు జరగదు. కేసీఆర్ ప్రెస్ మీట్ లో మర్యాద లేదు. మూడు వ్యవసాయ చట్టాలను వ్యతిరేకించి నందుకు రైతులపై కక్షగట్టి వ్యవసాయ రంగానికి కేటాయింపులు తగ్గించారు. ఎరువుల సబ్సిడీ తగ్గించారు. పంటలకు మద్దతు ధర తెస్తారని ఆశించాం. రైతుల పోరాటం చూసైనా పంటల మద్దతు ధరకు చట్టబద్దత కల్పించలేదు. కేంద్ర బడ్జెట్ నిరాశ పరిచింది. గోధుమలు, వరికి కొనుగోళ్లకు నిధులు తగ్గించారు.

ఉపాధి హామీ పధకానికి నిధులు తగ్గించారు. రైతుల ఆదాయాన్ని రెండింతలు చేయలేదు… పంట పెట్టుబడి రెండింతలయ్యేలా ఎరువుల సబ్సిడీ తగ్గించారు. జిఎస్టీ విధానంలో మార్పులు చేయలేదు. ఉద్యోగస్తుల కోసం ఎటువంటి నిర్ణయాలు బడ్జెట్ లో లేవు. వైద్య మౌలిక వసతుల కోసం నిధుల కేటాయింపులు లేవు. కరోనా ప్రభావం చూసాక కూడా పేదలకు వైద్యం అందించే చర్యలకు కేటాయింపులు లేవు. సాంకేతిక విద్య పేదలకు చేరువ చేయడానికి ప్రయత్నాలు లేవు. వ్యవసాయ రంగం కుంటుపడే పరిస్థితి వచ్చింది. విద్యార్థులు, రైతులు, ఉద్యోగులు,ఆరోగ్యం ఎవరికి ఉపయోగ పడే నిర్ణయాలు లేవు.

ధరలు తగ్గించెందుకు ఎటువంటి నిర్ణయాలు తీసుకోలేదు. ఎలక్ట్రానిక్స్,బంగారం,వజ్రాలు
వీటి ధరలు తగ్గించారు. సంపన్నులకు మేలు చేసేలా 10 శాతం మందికి ప్రయోజనం చేకూరేలా బడ్జెట్ ఉంది. తెలంగాణ విభజన అంశాలకు బడ్జెట్ లో కేటాయింపులు లేవు. కేంద్ర బడ్జెట్ గంటన్నర ఉంటే కేసీఆర్ రెండున్నర గంటలు ఏక పత్రాభినయం చేసారు. కల్తీ మందు తాగి వచ్చినట్లు మాట్లాడారువిభజన చట్టం అంశాలు,కోచ్ ఫ్యాక్టరీ, గిరిజన విశ్వవిద్యాలయం, ఎన్టీపీసీ యూనిట్ ,రైల్వే లైన్లు, జాతీయ రహదారుల విషయం ఏదీ మాట్లాడలేదు. మోడీ పై యుద్ధం ప్రకటిస్తారని ఆశించాం . నిర్మలా సీతారామన్, మోడీ గురించి నీచంగా,జుగుప్సాకరంగా కేసీఆర్ మాట్లాడారు. రాజ్యాంగాన్ని రద్దు చేయాలని మాట్లాడారు. భూస్వాములు,అగ్ర వర్ణాల కోసం రాజ్యాంగాన్ని మార్చాలన్న బిజెపి మాటలను కేసీఆర్ మాట్లాడినట్లు ఉంది. రాజ్యాంగాన్ని సవరించుకునే అవకాశం ఉంది.

రాజ్యాంగ సవరణ ద్వారా దళితులు, బలహీన వర్గాలకు మేలు చేసే ప్రయత్నం చేయాలి. రాజ్యాంగం మార్చలన్నది బిజెపి కుట్ర… బిజెపి కుట్రకు కేసీఆర్ వంత పాడారు. రాజ్యాంగం రద్దు చేయాలని బిజెపి ఎన్నో ఏళ్లుగా కుట్ర చేస్తుంది. కేసీఆర్ ను ముందుంచి రాజ్యాంగం రద్దు అంశాన్ని తెరమీడికి తెచ్చారు. బిజెపి రాజ్యాంగం రద్దు కుట్రకు కేసీఆర్ మద్దతు తెలిపారు. అన్ని జిల్లా,మండల కేంద్రాల్లో అంబెడ్కర్ విగ్రహం ముందు కేసీఆర్ దిష్టి బొమ్మలు దగ్దమ్ చేయాలి. కేసీఆర్ రాజ్యాంగం రద్దు ఆలోచనను ఉపసంహరించుకునేందుకు రెండు రోజుల పాటు గాంధీ భవన్ లో నిరసన దీక్షలు. రాజ్యాంగం రద్దు ఆలోచనను ఉపసంహరించుకొకపోతే దేశ యువత కేసీఆర్ నాలుక కొస్తారు. యూపీలో బిజెపిని గెలిపించాలన్న ఆలోచన కేసీఆర్ చేస్తున్నారు. కేసీఆర్ అసదుద్దీన్ ఒవైసి సుపారి గ్యాంగ్. యుపి ఎన్నికల్లో బీజేపీని గెలిపించడానికి సుపారి తీసుకున్నారు. ఓట్లు చీల్చడానికి ఎంఐఎం పోటీ చేస్తుంది. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా అసభ్యకరమైన భాష మాట్లాడారు .కేసీఆర్ భాషను ఖండిస్తున్నాం. సిద్ధాంత పరంగా బిజెపిని వ్యతిరేసిస్తాం ..కానీ కేసీఆర్ భాషను వ్యతిరేకిస్తున్నాం

ప్రధాన మంత్రిని ఉద్దేశించి ముఖ్యమంత్రి అసభ్యంగా మాట్లాడితే తెలంగాణ పరువు ఎం కావాలి. మహిళలను గౌరవించే సంస్కృతి భారత సంస్కృతి. కేసీఆర్ భాషను సభ్య సమాజం క్షమించదు. కేసీఆర్ భాష ఎవరిని ఉద్దేశించి మాట్లాడారో సమాధానం చెప్పాలి. దేశ ప్రజలకు రాష్ట్ర ప్రజలకు మేలు చేసేది కాంగ్రెస్ పార్టీనే. విభజన హామీలు అమలు కావాలంటే కాంగ్రెస్ తోనే సాధ్యం  రేవంత్ పేర్కొన్నారు.