ఏపీకి మోడీ సర్కార్ గుడ్ న్యూస్..రూ.879.08 కోట్లు విడుదల

0
112

ఏపీకి కేంద్ర ప్రభుత్వం తీపి కబురు చెప్పింది. తాజాగా ఏపీకి రూ.879.08 కోట్ల రెవెన్యూ లోటు నిధులు విడుద‌ల చేసింది కేంద్రం. కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ నాలుగో విడత కింద 14 రాష్ట్రాల‌కు రూ.7,183.42 కోట్లు రెవెన్యూ లోటు నిధులు విడుద‌ల చేసింది.

దీనితో ఆర్ధిక సంక్షోభంలో ఉన్న ఏపీకి ఊరటనిచ్చినట్లయింది మోడీ సర్కార్. రెవెన్యూ లోటును భ‌ర్తీ చేసేందు ఏపికి రూ.10,549 కోట్లు ఇవ్వాల‌ని 15 ఆర్థిక సంఘం సిఫార్సు చేసింది. అందులో భాగంగా కేంద్ర ప్ర‌భుత్వం ఇప్ప‌టి వ‌ర‌కు ఏపికి రూ.3,516.33 కోట్లు విడుద‌ల చేసింది.

ఇక ఆంధ్ర‌ప్ర‌దేశ్‌కు రూ.879.08 కోట్ల రెవెన్యూ లోటు నిధులు విడుద‌ల చేయడంతో.. జగన్‌ సర్కార్‌ కాస్త ఉపసమనం దొరికింది. మరోవైపు రెండు రోజుల పాటు సీఎం జగన్ కడపలో పర్యటించనున్నారు. కాగా ఇటీవల ఏపీలో అల్లూరి సీతారామరాజు జయంతి వేడుకల్లో ప్రధాని మోడీ పాల్గొన్న విషయం తెలిసిందే.