మోడీతో పోటు కేవలం 200 మందికి మాత్రమే ఎంట్రీ ఇంకెవ్వరికీ ఎంట్రీ లేదు…

మోడీతో పోటు కేవలం 200 మందికి మాత్రమే ఎంట్రీ ఇంకెవ్వరికీ ఎంట్రీ లేదు...

0
102

అయోధ్యలో ఆగస్టు 5 న నిర్వహించే భూమి పూజకు, ప్రధాన మంత్రి నరేంద్ర మోడీతో పాటు 200 మందిని మాత్రమే అనుమతించినట్లు రామజన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్టు కోశాధికారి గోవిందగిరి చెప్పారు. రాష్ట్ర ముఖ్యమంత్రులు అందరినీ ఆహ్వానిస్తామన్న ఆయన చెప్పారు.

కరోనా వైరస్ ప్రభావం వల్ల కొంతమందిని అనుమతించినట్లు ఆయన తెలిపారు. కాగా దేశంలో కరోనా వైరస్ విజృంభిస్తున్న సంగతి తెలిసిందే.. ప్రస్తుతం కరోనా కొత్త కేసులు రోజుకు ఒక రికార్డ్ ను సృష్టిస్తున్నాయి.. ఈ మాయదారి మహమ్మారిని అరికట్టేందుకు ఎన్ని ప్రయత్నాలు చేస్తున్నా కూడా చాపకింద నీరులా ప్రవర్తిస్తుంది…

దేశంలో తొలిసాని హిమాచల్ ముఖ్యమంత్రి జయరామ్ ఠాకూర్ కు కరోనా పాజిటివ్ నిర్ధారణ అయ్యింది… అలాగే సెలబ్రిటీలు కూడా కరోనా బారీన పడుతున్నారు… అందుకే అయోధ్యలో రామమందిర భూమి పూజకు నరేంద్రమోడీతో పాటు 200 మందికి మాత్రమే అనుమతించనున్నామని తీర్థ క్షేత్ర ట్రస్ట్ కోశాధికారి తెలిపారు…