ఏపీ ముఖ్యమంత్రిగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేసినప్పటినుంచి ఆయ శాఖలకు సంబంధించిన సమాచారాన్ని అధికారులతో అడిగి తెలుసుకుంటున్నారు. అయితే ఇప్పుడు ఆయన కేబినెట్ లో ఎవరెవరు ఉంటారనే దనిపై రాష్ట్ర వ్యాప్తంగా ఒక చర్చ సాగుతోంది. ఈ రోజు ఉదయం వైసీపీ ఎల్పీ సమావేశం తర్వాత కేబినెట్ కూర్పుకు తుది రూపుదిద్దుకునే అవకాశం ఉంది. ఆ తర్వాత జగన్ మొదటి సారి సచివలాయంలోకి అడుగు పెట్టనున్నారు. 11గంటల 49 నిమిషాలకు కొత్త కేబినెట్ ప్రమాణ స్వీకారం జరుగనున్న నేపథ్యంలో ఫైనల్ లిస్ట్ ఎవరెవరి పేర్లు ఉంటాయనే దానిపై ఇప్పుడు ఆసక్తికర చర్చ సాగుతోంది.
అయితే సీనియర్ నటుడు, వైఎస్సాఆర్‌సీపీ నేత మోహన్ బాబు తనపై మీడియాలో వస్తున్న వార్తలపై స్పదించారు. మోహన్‌బాబు టీటీడీ చైర్మన్ రేసులో ఉన్నట్టుగా వస్తున్న పుకార్లను ఆయన కొట్టిపారేశారు. తాను ఎలాంటి పదవులు ఆశించిన రాజకీయాల్లోకి రాలేదన్నారు. ‘నేను తిరుమల తిరుపతి దేవస్థానం చైర్మన్ రేసుల్లో ఉన్నట్టుగా వార్తలు, ఫోన్ కాల్స్ వస్తున్నాయి. నా ఆశయం వైఎస్ జగన్‌మెహన్ రెడ్డిని ముఖ్యమంత్రిగా చూడటం. అందుకోసం నా వంతుగా కష్టపడ్డాను. నేను తిరిగి రాజకీయాల్లోకి రావడానికి కారణం వైఎస్ జగన్ ప్రజల ముఖ్యమంత్రి అవుతాడన్న నమ్మకమే గాని ఎలాంటి పదవులు ఆశించి కాదు. మీడియాకు నా విన్నపం పుకార్లను ప్రోత్సహించకండి’ అంటూ మోహన్ బాబు ట్విటర్‌లో పోస్ట్ చేశారు.