బంగారు బుల్లోడుగా ‘గోపిచంద్‌’

బంగారు బుల్లోడుగా 'గోపిచంద్‌'

0
60

తెలుగు తెరపై యాక్షన్ హీరోగా ఎక్కువ మార్కులు కొట్టేసిన గోపీచంద్, ఆ తరువాత ఫ్యామిలీ ఆడియన్స్ ను కూడా థియేటర్స్ కి రప్పించే కథలను చేస్తూ వస్తున్నాడు. తాజాగా ఆయన తమిళ దర్శకుడు ‘తిరు’తో ఒక సినిమా చేస్తున్నాడు. యాక్షన్ తో కూడిన ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా ఈ సినిమా రూపొందుతోంది. ఇప్పటికే ఈ సినిమా 50 శాతానికి పైగా చిత్రీకరణ పూర్తయింది. ఈ సినిమాకి ‘బంగారు బుల్లోడు’ టైటిల్ ను పరిశీలిస్తున్నట్టుగా సమాచారం. దాదాపు ఇదే టైటిల్ ను ఖరారు చేయనున్నారట.

ఇప్పటికే ఈ సినిమా 50 శాతానికి పైగా చిత్రీకరణ పూర్తయింది. ఈ ఇక కథ విషయానికి వస్తే..తాను ప్రేమించిన అమ్మాయిని పొందడానికి హీరో ఎంతో మందితో పోరాడాల్సి వస్తందట..ఈ క్రమంలో ఆ కుటుంబ సభ్యులతో ఎలా ఎంట్రటైన్ మెంట్ చేశాడు..తన ప్రేమను ఎలా పొందాడు అనే కథాంశంతో ఈ సినిమా నిర్మితమవుతోందట. ఈ సినిమాలో ఇద్దరు హీరోయిన్లు గోపీచంద్ సరసన అలరించనున్నట్టుగా సమాచారం