కంట‌త‌డి పెట్టిన జగన్.. ఎల్పీ స‌మావేశంలో భావోద్వేగం..!!

కంట‌త‌డి పెట్టిన జగన్.. ఎల్పీ స‌మావేశంలో భావోద్వేగం..!!

0
69

వైసీపీ ఎల్పీ స‌మావేశంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేల‌కు దిశా నిర్దేశం చేస్తున్నారు ముఖ్యంత్రి వైఎస్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి. ప్ర‌స్తుతం దేశం మొత్తం మ‌న‌వైపే చూస్తుంద‌ని స్ప‌ష్టం చేశారు. రానున్న రోజుల్లో ఏ ఒక్క‌రు అవినీతికి అవ‌కాశం ఇవ్వ‌కూడ‌ద‌ని జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి పార్టీ ఎమ్మెల్యేల‌ను కోరారు. 2014 ఎన్నిక‌ల్లో అధికారంలోకి వ‌చ్చిన తెలుగుచేశం పార్టీ అధినేత చంద్ర‌బాబు నాయుడు పాల‌న‌లో అక్రమంగా ఎమ్మెల్యేలు దోచుకున్నార‌ని జ‌గ‌న్ అరోపించారు.

ప్రజాసంక్షేమం కోసం పాలనలో సమూలంగా మార్పులు తీసుకురావాల్సి ఉందని అన్నారు. ముఖ్యంగా, అవినీతికి ఏమాత్రం తావివ్వని రీతిలో పాలన ఉండాలని పేర్కొన్నారు. ఇకమీదట రాష్ట్రంలో ప్రతి టెండర్ కూడా జ్యుడిషియల్ కమిషన్ పర్యవేక్షణలో పారదర్శకంగా జరుగుతుందని సీఎం జగన్ వివరించారు. ఇప్పటికే జ్యుడిషియల్ కమిషన్ గురించి హైకోర్టు చీఫ్ జస్టిస్ తో మాట్లాడినట్టు ఎమ్మెల్యేలతో చెప్పారు.