ఏపీలో గ్రామ వాలంటీర్ల ఉద్యోగాలకు నోటిఫికేషన్..

ఏపీలో గ్రామ వాలంటీర్ల ఉద్యోగాలకు నోటిఫికేషన్..

0
65

ఆంధ్రప్రదేశ్ కొత్త ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి తన మార్క్ పాలనతో ముందుకు సాగుతోన్నారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీలు ఒకదానివెంట ఒకటి నెరవేర్చుకుంటూ వెళ్తున్నారు. వైసీపీ అధికారంలోకి వస్తే ప్రతి 50 కుటుంబాలకు ఒక వాలంటీర్‌ను నియమిస్తామని ప్రకటించారు. అదే విషయాన్ని ప్రమాణ స్వీకార వేదికపై మరోసారి స్పష్టం చేశారు. గ్రామీణ వాలంటీర్లు అన్ని రాష్ట్ర ప్రభుత్వ పథకాలను నేరుగా లబ్ధిదారులకు అందజేయవలసి ఉంటుంది. ఈ రిక్రూట్మెంట్ ప్రక్రియ ఆగష్టు 2 వ తేదీ చివరి నాటికి పూర్తి అవుతుంది. ఆగష్టు 15, స్వాతంత్ర దినోత్సవం నాటికి అర్హత పొందిన మరియు ఆసక్తి గల అభ్యర్థులను గ్రామ వాలంటీర్స్ గా నియమిస్తారు .

అభ్యర్థులు పదవ తరగతి ఉత్తీర్ణులై ఉండాలి.
గ్రామ వాలంటీర్లకు దరఖాస్తు కోసం అవసరమైన పత్రాలు :

* ఆధార్ కార్డు

* విద్యా అర్హత ప్రమాణాలు

* ssc సర్టిఫికేట్ ప్రకారం పుట్టిన తేదీ

* స్టడీ సర్టిఫికెట్

* కమ్యూనిటీ సర్టిఫికెట్

* నేటివిటీ / రెసిడెన్సీ సర్టిఫికెట్

* మెడికల్ సర్టిఫికెట్ (PHC అభ్యర్థులకు )

వయోపరిమితి:

అభ్యర్థులు ఈ పోస్టును దరఖాస్తు చేయాలనుకుంటే, వయస్సు 18 నుండి 39 సంవత్సరాలు ఉండాలి.

అప్లికేషన్ ఫీజు :

దరఖాస్తు కోసం OBC అభ్యర్థులు Rs.150/- మరియు SC /ST / PWD అభ్యర్థులు ఫీజు చెల్లించాల్సిన అవసరం లేదు.

వేతనం :

అభ్యర్థులు నెలకు Rs.5,000/- వరకు పొందవచ్చు

జిల్లా వారీగా గ్రామాల జాబితా:

అనంతపురం -1066, చిత్తూరు – 1627, తూర్పు గోదావరి – 1117, గుంటూరు – 927, కృష్ణ – 1206, కర్నూలు – 1421, ప్రకాశం – 1100, ఎస్ పి ఎస్ నెల్లూరు – 1414, శ్రీకాకుళం – 2300, విశాఖపట్నం – 4198, విజయనగరం – 2160, పశ్చిమ గోదావరి – 751, Y.S.R. కడప – 1021.