FLASH NEWS – సోమవారం నుంచి  అక్కడ షాపింగ్ మాల్స్, మార్కెట్లు ఓపెన్

0
97

ఈ కరోనా కేసులు మొదట వేగంగా నమోదు అయింది ఢిల్లీలోనే,  వెంటనే అక్కడ సర్కారు అప్రమత్తమైంది, ఫస్ట్ వేవ్ సెకండ్ వేవ్ లో కూడా భారీగా కేసులు నమోదు అయ్యాయి.., దీంతో వెంటనే అక్కడ లాక్ డౌన్ పెట్టారు… అయితే క్రమంగా హస్తినలో కేసులు తగ్గుతున్నాయి దీంతో అరవింద్ కేజ్రీవాల్ సర్కార్ క్రమంగా లాక్ డౌన్ ను ఎత్తేస్తోంది…. మరిన్ని సడలింపులను ఇస్తున్నట్టు సీఎం కేజ్రీవాల్ ప్రకటించారు.

పాజిటివిటీ రేటు 0.5 శాతంగా ఉంది రోజువారి కేసులు 400 కి తగ్గాయి అని తెలిపారు.. మరిన్ని సడలింపులు ఇస్తున్నారు.. అయితే ప్రజలు మాత్రం కచ్చితంగా కోవిడ్ రూల్స్ పాటించి జాగ్రత్తలు తీసుకోవాలి.. సోమవారం నుంచి షాపింగ్ మాల్స్ , మార్కెట్లను సరి–బేసి విధానంలో తెరుచుకోవచ్చని చెప్పారు. అయితే జనం ఎక్కువగా గుమిగూడవద్దని తెలిపారు.

ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 8 గంటలకు షాపులను తెరవచ్చు, దీంతో వ్యాపారులు ఆనందంలో ఉన్నారు.

ఇటు ప్రభుత్వ కార్యాలయాల్లో గ్రూప్ ఏ ఆఫీసర్లు వంద శాతం విధులకు హాజరు కావాలన్నారు. . ప్రైవేటు ఆఫీసులను 50 శాతం సిబ్బందితో నడుపుకోవచ్చని తెలిపారు సీఎం… అత్యవసర సిబ్బంది వంద శాతం హజరవ్వాలని తెలిపారు.. ప్రయాణికులు కచ్చితంగా తెలుసుకోవాలి  50 శాతం సామర్థ్యంతో ఢిల్లీ మెట్రో నడుస్తుంది…. ఈ కామర్స్ సేవలను  ప్రారంభించుకోవచ్చని సంస్దలకు తెలిపారు.