మరో ఆరుగురికి షాకిచ్చిన సీఎం జగన్

మరో ఆరుగురికి షాకిచ్చిన సీఎం జగన్

0
103

తెలుగుదేశం పార్టీలో గెలిచిన 23 మంది ఎమ్మెల్యేలలో కొందరు పార్టీ మారేందుకు పక్కా ప్రణాళికతో ముందుకు వెళుతున్నారు… బీజేపీ వైసీపీ ల వైపు చూస్తున్నారు.. అయితే వీరే కాదు జగన్మోహన్ రెడ్డిపై గతంలో విమర్శలు చేసి పార్టీ మారిన 23 మంది ఫిరాయింపు నేతలు కూడా ఇప్పుడు పార్టీ మారాలి అని చూస్తున్నారట.. ఇందులో ఆరుగులు వైసీపీలో చేరేందుకు ప్రణాళిక వేసుకున్నారు.

అయిత ఓ ఎంపీ ద్వారా రాయబారం నడుపుతున్నారు.. కాని సీఎం జగన్ మాత్రం దీనికి గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం లేదు అని తెలుస్తోంది. పార్టీని కష్టకాలంలో వదిలేసి పార్టీ మారిన వారిని చేర్చుకోవద్దు అని అంటున్నారట.. అందుకే పార్టీ ని వదిలి వెళ్లిన ఫిరాయింపులని పట్టించుకోవద్దని వారిని కలవవద్దని అలాంటి చేరికల గురించి నాకు చెప్పవద్దు అని జగన్ తెలియచేశారట.

అయితే తెలుగుదేశంలో ఉంటే మరో ఐదు సంవత్సరాలు పోరాటం చేయాలి అని.. ఎలాగో గతంలో జగన్ తో కలిసి పనిచేశాము కాబట్టి ఇఫ్పుడు పార్టీ మారాలి అని చూస్తున్నారట.. కాని వారి ఆశలు కలలుగానే మిగిలిపోతాయి అంటున్నారు పార్టీ నేతలు.