Breaking News- టీఆర్ఎస్ లోకి మోత్కుపల్లి..ముహూర్తం ఫిక్స్

Motkupalli into TRS..moment fix

0
169

తెదేపా మాజీ నేత మోత్కుపల్లి నర్సింహులు తెరాసలో చేరనున్నారు. ఈనెల 18న సీఎం కేసీఆర్ సమక్షంలో ఆయన టీఆర్ఎస్ తీర్ధం పుచ్చుకోనున్నారు. మిగిలిన వారితో కాకుండా విడిగా చేరాలని ఆయన భావిస్తున్నట్లు తెలిసింది.

మహానాడుకు పిలవలేదు అనే నెపంతో చంద్రబాబుని తీవ్రంగా ధూషించి పార్టీ నుండి సస్పెండ్ అయ్యారు మోత్కుపల్లి. గవర్నర్ గిరిపై గంపెడు ఆశలు పెట్టుకున్న ఆయన టీడీపీ ఎన్డీయే నుండి రావడంతో పార్టీ మారడానికి సిద్ధం అయిపోయారు. టీడీపీ తెరాసతో విలీనం అవ్వాలని మీడియా ముఖంగా చెప్పడంతో పార్టీ ఆయన ఉద్దేశం గ్రహించి పక్కన పెట్టడం మొదలు పెట్టింది.