తెలంగాణ పిసిిస చీఫ్ రేస్ లో చివరి వరకు ప్రయత్నం చేసి విఫలమయ్యారు భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి. ఆయన ఢిల్లీ నుంచి ఆదివారం విమానంలో హైదరాబాద్ చేరుకున్నారు. శంషాబాద్ ఎయిర్ పోర్ట్ లో తన ఆగ్రహాన్ని, ఆక్రోశాన్ని వెల్లగక్కారు. రేవంత్ రెడ్డితోపాటు అధిష్టానం పైనా తీవ్రమైన విమర్శలు గుప్పించారు. ఆయన మాటల్లో పిసిిసి చీఫ్ పదవి రాలేదన్న బాధకు తోడు, టిడిపి నుంచి నిన్న గాక మొన్న వచ్చిన రేవంత్ రెడ్డికి పదవి కట్టబెట్టడం పట్ల అగ్గి మీద గుగ్గిలమయ్యారు.
కోమటిరెడ్డి వెంకట రెడ్డి కామెంట్స్ చూస్తుంటే ఆయన కాంగ్రెస్ లోనే కొనసాగుతారా.. లేదంటే పార్టీ మారతారా అన్నది ఇప్పుడు చర్చనీయాంశమైంది. ఆయన ఒక్క రేవంత్ రెడ్డినే కాదు అధిష్టానాన్ని కూడా కడిగి పారేయడంతో తెలంగాణ కాంగ్రెస్ లో అసమ్మతి భగ్గుమన్నదని చెప్పవచ్చు. అయితే కోమటిరెడ్డి పాదయాత్రకు సిద్ధమవుతున్న నేపథ్యంలో పాదయాత్ర చేస్తూనే… భవిష్యత్ కార్యాచరణ రూపొందించుకునే అవకాశాలు కనబడుతున్నాయి. శంషాబాద్ ఎయిర్ పోర్ట్ లో ఆయనేమన్నారో చదవండి.
టిపిసిసి కి ఏర్పాటైన కొత్త కార్యవర్గాన్ని అభినందిస్తున్నాను.
వారి నాయకత్వంలో రాబోయో హుజుూర్ నగర్ ఎన్నికల్లో డిపాజిట్లు తెచ్చుకోవాలని ఆశిస్తున్నాను.
ఓటుకు నోటు కేసు మాదిరిగానే పిసిసి ఎన్నిక జరిగినట్టు నాకు ఢిల్లీ వెల్లాక తెలిసింది. పిసిసి పదవిని అమ్ముకున్నట్లు అనిపించింది.
నన్ను కలిసేందుకు కొందరు ప్రయత్నిస్తున్నారని తెలిసింది కానీ నూతన అధ్యక్షునితో పాటు కాంగ్రెస్ కార్యకర్తలు ఎవరు కూడా నన్ను కలిసేందుకు ప్రయత్నం చేయకూడదని కోరుతున్నాను.
హూజూరాబాద్ లో రాబోయో ఎన్నికల్లో కొత్త కార్యవర్గం కనీసం డిపాజిట్లు తెచ్చుకోవాలి అని కోరుకుంటున్నాను.
కాంగ్రెస్ పార్టీ కూడా టి టిడిపి మాదిరిగానే మారబోతుందని అనిపిస్తున్నది.
టి పిసిసిలో కార్యకర్తలను గుర్తింపులేదని ఇప్పుడు తేలిపోయింది.
కార్యకర్తలే ప్రాణంగా బతికిన వాడిని. నా రాజకీయ భవిష్యత్తు కార్యకర్తలు నిర్ణయిస్తారు.
ఇకపై గాంధీభవన్ గడప తొక్కను అని శపథం చేస్తున్నాను.
పార్టీని నమ్ముకున్న కార్యకర్తలకు ఒకటే పార్టీలో ఉన్న వెంకట్ రెడ్డికే అన్యాయం జరిగిందని… రేపు మనకు కూడా అదే పరిస్థితి జరుగుతుందని వారు ఆవేదన చెందుతున్నారు.
రేపటి నుండి ఇబ్రహింపట్నం నుండి మొదలు పెట్టుకుని భువనగిరి వరకు పాదయాత్ర చేస్తా.
ప్రజల మధ్యనే ఉంటా కొత్త నాయకులను కొత్త కార్యకర్తలను ప్రోత్సహిస్తా.
నల్గోండ జిల్లాలోని ఏడు నియోజకవర్గాల గెలుపుకోసం కృషి చేస్తా.
పార్లమెంట్ లో నా గళం వినిపిస్తా. నా నియోజకవర్గ సమస్యలతోపాటు తెలంగాణ సమస్యలను ప్రస్తావిస్తా.
గడ్కరీ గారు స్వయంగా చెప్పారు… ఎల్బినగర్ నుండి అందోళ్ మైసమ్మ వరకు జాతియ రహదారి కోమటిరెడ్డి వెంకటరెడ్డి చెప్తేనే మంజురు చేశానని.
నాగార్జునసాగర్ కు 370 కోట్లతో పనులు జరుగుతున్నాయి.