చంద్రబాబుకు మరో బిగ్ షాక్ మరో టీడీపీ నేతకు అస్వస్థత

చంద్రబాబుకు మరో బిగ్ షాక్ మరో టీడీపీ నేతకు అస్వస్థత

0
76

తెలుగుదేశం పార్టీ మాజీ ఎంపీ శివప్రసాద్ రావు తీవ్ర అస్వస్థతకు గురి కావడంతో ఆయన కుటుంబ సభ్యులు ఇటీవలే హూటా హుటీన ఆసుపత్రికి తరలించిన సంగతి తెలిసిందే. కొద్దిరోజులు శివప్రసాదరావుకు చెన్నైలోని అపోలో ఆసుపత్రిలో చికిత్స అందించారు…

తాజాగా ఆయన ఆరోగ్యం కుదుట పడటంతో కుటుంబసభ్యులు ఇంటికి తీసుకువచ్చారు… అయితే ఆయనకు కిడ్నీ సంబంధించిన వ్యాధి మళ్లీ తిరగడంతో ఈరోజు కుటుంబ సభ్యులు మెరుగైన వైద్యం కోసం మరోసారి చెన్నైలోని అపోలో ఆసుపత్రికి తరలించారు..

ప్రస్తుతం శివప్రసాదరావు అక్కడ చికిత్స పొందుతున్నారు. కాగా టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు ప్రత్యేక హోదా సాధనకోసం శివప్రసాదరావు పార్లమెంట్ గేటు ఎదుట రోజుకు ఒక వేశం వేసి కేంద్రాన్ని నిలదీసేవారు.. చిత్తూరు లోక్ సభస్థానం నుంచి ఆయన రెండుసార్లు ఎంపీగా గెలిచారు.