ఆస్తితో సరికొత్త రికార్డ్ నమోదు చేసిన భారతీయ కుబేరుడు ముఖేష్ అంబానీ

ఆస్తితో సరికొత్త రికార్డ్ నమోదు చేసిన భారతీయ కుబేరుడు ముఖేష్ అంబానీ

0
100

సంపన్నుల సంపద అంతకంతకూ పెరుగుతూనే ఉంటుంది, పైగా ఈ రోజుల్లో షేర్ల ర్యాలీ జోరు ఉంది అంటే చాలు ఒక్కోరోజులేనే అంచనాలు మారిపోతాయి, బిలియనీర్లు మరింత ముందుకు వస్తారు, తాజాగా మన దేశంలో చెప్పుకోవాలి అంటే కుబేరుడు ధనవంతుడు అంటే రిలయన్స్ అధినేత ముఖేష్ అంబానీ, తాజాగా ఆయన మరో అడుగు ముందుకు వేశారు.

ప్రపంచ కుబేరుల జాబితాలో బెర్క్ షైర్ హాత్ వే అధినేత వారెన్ బఫెట్ ను వెనక్కి నెట్టారు. బ్లూమ్ బెర్గ్ బిలియనర్స్ జాబితాలో ముఖేశ్ అంబానీ 8వ స్థానం దక్కించుకోగా, బఫెట్ 9వ స్థానంలో నిలిచారు.
జియోలో నిధులు భారీగా పెట్టుబడులు వచ్చిన తర్వాత షేర్ల జోరు గిరాకీ పెరిగింది, దీంతో అంబానీ ఆస్ధి అమాంతం పెరుగుతోంది.

ముఖేష్ అంబానీ నికర సంపద విలువ 68.3 బిలియన్ డాలర్లు కాగా, బఫెట్ ఆస్తి విలువ 67.9 బిలియన్ డాలర్లు., అమెజాన్ అధినేత జెఫ్ బెజోస్ 188 బిలియన్ డాలర్లతో ముందు వరుసలో ఉన్నాడు..