తెలంగాణలో మరో ఎన్నికలు మున్సిపల్ ఎన్నికల నోటిఫికేషన్ విడుదల

తెలంగాణలో మరో ఎన్నికలు మున్సిపల్ ఎన్నికల నోటిఫికేషన్ విడుదల

0
93

తెలంగాణలో మున్సిపల్ పోరుకు పార్టీలు సిద్దం అవుతున్న సంగతి తెలిసిందే .. తాజాగా మున్సిపల్ పోరుకు సంబంధించి నేతలకు ఓ గుడ్ న్యూస్ వచ్చేసింది. నేడు ఎన్నికల సంఘం నుంచి ప్రకటన వచ్చేసింది… జనవరి 22న పోలింగ్ ఉంటుందని, జనవరి 25న ఓట్ల లెక్కింపు ఉంటుందని ప్రకటించారు.

జనవరి 8 నుంచి 10వ తేదీ వరకు నామినేషన్లు స్వీకరిస్తారు,అలాగే … జనవరి 11న నామినేషన్ల స్క్రూటినీ నిర్వహించనున్నారు, జనవరి 14లోపు నామినేషన్ల ఉపసంహరణకు వీలుంటుంది.ఇక కరీంనగర్ మినహా కార్పొరేషన్లు, 120 మున్సిపాలిటీల్లోని 325 కార్పొరేటర్, 2727 కౌన్సిలర్ స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి.

ఇక ఈ ఎన్నికల్లో ఎలాగైనా గెలవాలి అని కాంగ్రెస్ భావిస్తోంది మరో పక్క టీఆర్ ఎస్ కూడా మొత్తం అన్నీ సీట్లు గెలవాలి అని చూస్తున్నారు, మున్సిపల్ ఎన్నికలకు రిజర్వేషన్లు ఖరారు చేయకుండానే నోటిఫికేషన్ జారీ చేయకూడదని తెలంగాణ కాంగ్రెస్ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి హైకోర్టును ఆశ్రయించారు, కాని ఆయన వేసిన పిటిషన్ కోర్టు కొట్టివేయడంతో ఎన్నికలకు గ్రీన్ సిగ్నల్ వచ్చింది.