బ్రేకింగ్ – ఏపీ మంత్రి పేర్నినానిపై హత్యాయత్నం

బ్రేకింగ్ - ఏపీ మంత్రి పేర్నినానిపై హత్యాయత్నం

0
104

వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత ఏపీ మంత్రి పేర్నినానిపై హత్యాయత్నం జరిగింది.. ఏపీలో పెను సంచలనం అయింది ఈ ఘటన , నేడు ఆయన పై దాడి చేయడానికి ప్రయత్నించాడు ఓ వ్యక్తి, అయితే వెంటనే అతనిని పట్టుకుని పోలీసులకి అప్పగించారు ఆయన అనుచరులు.

ఈ హత్యాయత్నం నుంచి మంత్రి తృటిలో తప్పించుకోగలిగారు. ఈ సమయంలో ఆయన చొక్కా చిరిగిపోయింది.ఉదయం మంత్రి అనుచరులు పార్టీ నేతలతో ఇంటిలో సమావేశం అయ్యారు, ఈ సమయంలో మంత్రి కాళ్లకు నమస్కారం చేయడానికి వెళ్లిన ఓ వ్యక్తి ఆయనపై దాడి చేసేందుకు తాపీ తీశాడు.

అతని కదలికలను గుర్తించిన అనుచరులు ఆ వ్యక్తిని వెనక్కి లాగేశారు. తప్పించుకుని పారిపోవడానికి ప్రయత్నించగా
అనుచరులు పట్టుకున్నారు, అతనిని పోలీసులకు అప్పగించారు, అయితే అతను తాపీమేస్త్రీ అని తెలుస్తోంది, దీని వెనుక ఏమైనా కారణాలు ఉన్నాయా అనేది విచారణ చేస్తున్నారు. అతని సెల్ ఫోన్ స్వాదీనం చేసుకున్నారు పోలీసులు.గతంలో మచిలీపట్నంలోనే పేర్నినాని అనుచరుడొకరు దారుణహత్యకు గురైన విషయం తెలిసిందే. మచిలీపట్నం మార్కెట్ యార్డు మాజీ ఛైర్మన్ మోకా భాస్కర్ రావును ఆయన ప్రత్యర్థులు హత్య చేశారు. ఇది మరువక ముందే ఇలా మంత్రిపై దాడికి పాల్పడటం పై పార్టీ నేతలు షాక్ అయ్యారు.