మనకు పంచదార తయారీ కాకముందు అందరూ తీన్నది కేవలం తేనె మాత్రమే.. తీపి పదార్దం అంటే తేనె అని అనుకునేవారు, కాని తర్వాత తర్వాత అనేక రకాల స్వీట్స్ పంచదార బెల్లం వచ్చేశాయి, అయితే ఈ తేనె ఆరోగ్యానికి చాలా మంచిది కాని దాదాపు పది ఏళ్ల నుంచి చాలా వరకూ తేనె టీగలు చనిపోతున్నాయి.
భూమిపై అంతరించిపోతున్న జీవులు జాబితాలో తేనెటీగలు కూడా చేరాయట. చాలా వరకూ అడవలు నరికివేస్తున్నారు పొలాల్లో పొగపెట్టడం చెట్లపై ఉండే తెనె తుట్టని తెంపడం ఇక పురుగుల మందులు ఇలా అనేక రకాలు వాడటంతో వాటికి బ్రతకడం కష్టం గా మారింది.
తేనెటీగలు అంతరించిపోతే సముద్ర జీవులు తప్ప భూమ్మీద ఏ జీవరాశి కూడా ఎక్కువ రోజులు బతికుండవు. ఇక తెనె టీగలు మొత్తం అంతరించిపోతే మనిషి కేవలం ఐదు సంవత్సారలు బతుకుతాడు … ఎందుకంటే మనం పండిస్తున్న 100 రకాల పంటల్లో 90 రకాల పంటలు పుష్పించి, కాపు కాయాలంటే తేనెటీగలే అవసరం. పువ్వుల్లోని పుప్పొడి రేణువుల్ని తేనెటీగలు మోసుకెళ్లడం వల్లే పరాగ, పరపరాగ సంపర్కం జరిగి పంటలు పండుతున్నాయి.
అవి చనిపోవడం వల్ల ఇది జరుగదు.. సో ఎలాంటి పంటలు పండవు అని తెలియచేస్తున్నారు సైంటిస్టులు
ఈ భూమ్మీద ఉన్న జీవరాశుల్లో ఒక్క తేనెటీగలు మాత్రమే రోగాలను వ్యాప్తి చేయవు, ఎలాంటి ఫంగస్, బ్యాక్టీరియా వీటి ద్వారా రాదు, అందుకే వీటిని రక్షించండి ఎక్కడా వీటిని చంపకండి.