మళ్లీ పోరాడుదాం : నాగబాబు

మళ్లీ పోరాడుదాం : నాగబాబు

0
90

ఆంధ్రప్రదేశ్‌లో అఖండ విజయం సాధించినా వైసీపీని, ఆ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డిని నాగబాబు అభినందించారు. ఏపీ ఎన్నికల ఫలితాలపై జనసేన ముఖ్యనేత, పవన్ కళ్యాణ్ సోదరుడు నాగబాబు స్పందించారు. ఏపీ ప్రజలు ఎన్నో ఆశలతో వైసీపీకి ఓట్లు వేశారని… వారి ఆకాంక్షలను నెరవేర్చాల్సిన బాధ్యత జగన్మోహన్ రెడ్డిపై ఉందన్నారు. వైసీపీ ప్రభుత్వం ఆ దిశగా పని చేయాలని, అందుకు తమ సహకారం కూడా ఉంటుందని నాగబాబు తెలిపారు. ఏపీలో ఓటమి పాలైనా తాము మాత్రం వెనకడుగు వేయబోమని నాగబాబు అన్నారు. ఓడిపోయామనే బాధను మర్చిపోయేందుకు జనసేన కార్యకర్తలు నెల రోజుల పాటు రెస్ట్ తీసుకోవాలని ఆయన సూచించారు. నెల, రెండు నెలల తరువాత మళ్లీ ప్రజాక్షేత్రంలో ఏ రకంగా వ్యవహరించాలనే దానిపై పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కార్యాచరణ రూపొందిస్తారని నాగబాబు అన్నారు.