మోదీ హవాలో గల్లంతైన మాజీ ముఖ్యమంత్రులు

మోదీ హవాలో గల్లంతైన మాజీ ముఖ్యమంత్రులు

0
72

2019 ఎన్నికల్లో ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ హవాలో మాజీ ప్రధాన మంత్రి దేవగౌడ, కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ సహా పలువురు మాజీ ముఖ్యమంత్రులు ఎన్నికల్లో పోటీ చేసిన విజయం సాధించలేక పోయారు. కొన్ని దశాబ్ధాల పాటు ఆయా రాష్ట్రాల్లో చక్రం తిప్పిన నేతలు కూడా మోదీ వేవ్‌లో కొట్టుకుపోయారు. ఇందులో డజనుకు పైగా మాజీ ముఖ్యమంత్రులున్నారు. ఒకప్పటి కర్ణాటక ముఖ్యమంత్రిగా ప్రధానిగా సేవలు అందించిన దేవ గౌడ ఈ ఎన్నికల్లో మోదీ హవాలో తుముకూరులో ఓటమి పాలైయ్యారు.

మధ్య ప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి దిగ్విజయ్ సింగ్..భోపాల్‌లో సాధ్వీ ప్రజ్ఞా సింగ్ పై 3.6 లక్షల ఓట్ల తేడాతో ఓడిపోయారు. మూడు సార్లు ఢిల్లీ ముఖ్యమంత్రిగా అది సుధీర్ఘకాలం సేవలు అందించిన షీలా దీక్షిత్..ఈశాన్య ఢిల్లీలో అక్కడి రాష్ట్ర అధ్యక్షుడు మనోజ్ తివారీ చేతిలో ఓటమి పాలైయ్యారు. 1992-94 మధ్య కర్ణాటక ముఖ్యమంత్రిగా పనిచేసిన వీరప్ప మొయిలీ ఈ ఎన్నికల్లో చికబల్లాపూర్ స్థానంలో 5లక్షల 63 వేల 802 ఓట్ల తేడాతో ఓడిపోయారు. ఆయన పై బచే గౌడ ఘన విజయం సాధించారు. మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి..దేశ హోం మంత్రిగా పనిచేసిన సుశీల్ కుమార్ షిండే ఈ ఎన్నికల్లో షోలాపూర్ నుంచి బీజేపీ అభ్యర్ధి సిద్దేశ్వర్ శివాచార్య చేతిలో లక్షన్నర ఓట్ల తేడాతో ఓటమి పాలైయ్యారు. జమ్మూ కాశ్మీర్ మాజీ ముఖ్యమంత్రిగా పనిచేసిన మెహబూబా ముఫ్తీ అనంత్ నాగ్ లోక్‌సభ స్థానంలో 10 వేల ఓట్ల తేడాతో నేషనల్ కాన్ఫిరెన్స్ అభ్యర్ధి హస్నైన్ మసూది చేతిలో ఓడిపోయారు. ఈ ఎన్నికల్లో మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రిగా పనిచేసిన అశోక్ చవాన్.. నాందేడ్ నుంచి పోటీ చేసి తన సమీప బీజేపీ అభ్యర్ధి ప్రతాప్ రావ్ చవాన్ చేతిలో 40 వేల ఓట్ల తేడాతో ఓడిపోయారు.

ఉత్తరాఖండ్ మాజీ ముఖ్యమంత్రి హరీష్ రావత్..నైనిటాల్ నియోజకవర్గంలోని బీజేపీ అభ్యర్ధి అజయ్ భట్ చేతిలో ఓడిపోయారు. హర్యాణ మాజీ సీఎం భూపిందర్ సింగ్ హుడా సోనీపట్ నుంచి బీజేపీ అభ్యర్ధి రమేష్ చందర్ చేతిలో లక్షన్నరకు పైగా ఓట్ల తేడాతో ఓడిపోయారు. మేఘాలయ మాజీ ముఖ్యమంత్రిగా పనిచేసిన ముఖల్ సంగ్మా ఈ ఎన్నికల్లో ఎన్డీఏ అభ్యర్ధి నేషనలల్ పీఫుల్స్ పార్టీ అభ్యర్ధి అగాథ సంగ్మా 3 లక్షల ఓట్ల మెజారిటీతో గెలుపొందారు. ఝార్జండ్ మాజీ ముఖ్యమంత్రి ఝార్ఖండ్ వికాస్ మోర్చా (ప్రజా తాంత్రిక్) అబ్యర్థి బాబులాల్ మరాండీ..తన బీజేపీ అభ్యర్ధి అన్నపూర్ణ దేవీ 4 లక్షల ఓట్ల తేడాతో ఓడిపోయారు. ఝర్ఖండ్ ముక్తి మోర్చా అధ్యక్షుడు,మాజీ ముఖ్యమంత్రి శిబు సోరేన్ దుమ్కాలో బీజేపీ అభ్యర్ధి సునీల్ సోరేన్ చేతిలో 47 వేల ఓట్ల తేడాతో ఓటమి పాలయ్యారు. ఇలా చేప్పుకుంటు పోతే చాలా మంది మోదీ హవలో కనుమరుగై పోయారు.