అన్నే అనుకుంటే తమ్ముడు కూడా ఎదో చేసేలా ఉన్నాడు..!!

అన్నే అనుకుంటే తమ్ముడు కూడా ఎదో చేసేలా ఉన్నాడు..!!

0
61

విజయ్ దేవరకొండ తమ్ముడు ఆనంద్ దేవరకొండ కథానాయకుడిగా .. జీవితా రాజశేఖర్ రెండో కూతురు శివాత్మిక కథానాయికగా ‘దొరసాని’ సినిమా రూపొందుతోంది. కేవీఆర్ మహేంద్ర దర్శకత్వం వహిస్తోన్న ఈ సినిమా, ఇప్పటికే చాలావరకూ చిత్రీకరణను జరుపుకుంది. మధుర శ్రీధర్ రెడ్డి – యష్ రంగినేని నిర్మిస్తోన్న ఈ సినిమా ద్వారానే, నాయకా నాయికలు పరిచయమవుతున్నారు.

కొంతసేపటి క్రితం ఈ సినిమా నుంచి ప్రీ లుక్ ను రిలీజ్ చేశారు. సినిమాపై ఈ ప్రీ లుక్ ఆసక్తిని రేకెత్తించేదిలా వుంది. ఈ నెల 30వ తేదీన ఫస్టులుక్ ను రిలీజ్ చేయనున్నారు. కథాకథనాల సంగతి అటుంచితే ‘దొరసాని’ అనే టైటిల్ ఎక్కువ మార్కులు కొట్టేసింది. జనాన్ని థియేటర్ కి రప్పించే ఇంట్రెస్టింగ్ టైటిల్ ఇది. ఇక థియేటర్లో కూర్చున్న తరువాత మెప్పించవలసిన బాధ్యత దర్శకుడిదే. మహేంద్ర ఏ మాయ చేస్తాడో చూడాలి మరి.