తెలుగమ్మాయి పూజిత పొన్నాడ హాలీవుడ్ రేంజ్ లో చూపిస్తుందిగా..!!

తెలుగమ్మాయి పూజిత పొన్నాడ హాలీవుడ్ రేంజ్ లో చూపిస్తుందిగా..!!

0
52

డైరెక్టర్ సుకుమార్ వెలుగులోకి తెచ్చిన అచ్చ తెలుగు అందం పూజిత పొన్నాడ. సుకుమార్ కథ అందించిన దర్శకుడు సినిమాతో ఆమె వెండితెరకు పరిచయమైంది. ఆ సినిమా పెద్దగా ఆడకపోయినా అందులో పూజిత నటన సుకుమార్ కు బాగా నచ్చింది. ఇక తాజాగా నటి పూజిత పొన్నాడ ఫోటోషూట్‌లో పాల్గొంది. ఈ ఫోటోల్లో పూజిత చాలా హాట్‌గా ఉంది. పలు రకాల డ్రెస్‌ల్లో ఆమె ఇచ్చిన ఎక్స్‌ప్రెషన్ అదిరిపోయింది. ఈ ఫోటోల్లో చాలా గ్లామర్‌తో మెరిసిపోయింది ఈ భామ.ఆమె పలు చిత్రాల్లో హీరోయిన్‌గాను నటించింది.

అచ్చ తెలుగమ్మాయి అయిన పూజిత మంచి బ్రేక్‌ కోసం ఎదురు చూస్తోంది. తెలుగమ్మాయి అనేసరికి అంతా తనకి పల్లె పడతి పాత్రలు ఆఫర్‌ చేస్తున్నారని అనిపించిందో ఏమో కానీ తనలోని మోడ్రన్‌ గాళ్‌ని చూడమంటూ ప్రదర్శిస్తూ ఇంస్టాగ్రామ్ లో పోస్ట్ చేసింది.. ఈ ఫోటోలతో అవకాశాల మాట ఎలా వున్నా పూజితకి ఫాలోవర్స్‌ అయితే పెరుగుతున్నారు. అచ్చ తెలుగమ్మాయి ఇలా బోల్డ్‌గా కనిపించడం అరుదే కాబట్టి అంత మంది ఎక్స్‌పోజింగ్‌ చేసే నటీమణుల మధ్య కూడా పూజితకి అటెన్షన్‌ దక్కుతోంది.