Alltimereport, Desk : దీపావళి పండగ సందర్భంగా దేశవ్యాప్తంగా భారీగా బిజినెస్ (Diwali Shopping) జరిగింది. అన్ని రంగాల్లో అమ్మకాలు ఊహించిన దానికంటే ఎక్కువగానే జరిగింది. కానీ ఈ అదృష్టం స్మార్ట్‌ఫోన్ బిజినెస్‌కు దక్కలేదు. అన్ని రంగాల్లో సెల్స్ ఆకాశమే హద్దులా చెలరేగుతుంటే స్మార్ట్ ఫోన్ బిజినెస్‌లు మాత్రం అంతంతమాత్రంగానే నడిచాయి. రీటెయిల్ విక్రయాలు గణనీయంగా పడిపోయాయి. గతేడాదితో పోలిస్తే ఈ ఏడాది అమ్మకాలు 18–20 శాతం తగ్గిందని నిపుణులు చెప్తున్నారు. ఇందుకు అంతర్జాతీయంగా పెరిగిన ధరలే కారణమని ఆల్ ఇండియా మొబైల్ రిటెయిలర్స్ అసోసియేషన్(ఏఐఎంఆర్) తన నివేదికలో పేర్కొంది.
అసోసియేషన్ లెక్కల ప్రకారం.. యాపిల్, మోటోరోలా వంటి మొబైల్ తయారీ కంపెనీలకు కస్టమర్ల నుంచి మంచి ఆదరణ వచ్చింది. మొత్తం స్మార్ట్ ఫోన్స్‌లో యాపిల్ పాత మోడల్స్‌తో పాటు కొత్తగా వచ్చిన ఐఫోన్ 18 ప్రో, ప్రో మ్యాక్స్‌ను కొనడానికి కస్టమర్లు ఆసక్తి చూపారు. మరోవైపు గూగుల్ పిక్సెల్ అమ్మకాలు కూడా బాగానే పెరిగాయి. అయితే రియల్‌మీ మాత్రం ఈ పండగ సీజన్‌లో భారీ నష్టాలను నమోదు చేసిన బ్రాండ్‌గా నిలిచింది. కొత్త లాంచ్‌లు లేకపోవడం, ధరలు పెరగడం కంపెనీ విక్రయాలపై తీవ్ర ప్రభావం చూపింది. దాంతో పాటుగానే ఆన్‌లైన్, ఆఫ్‌లైన్ ధరల మధ్య ఉన్న తేడా కారణంగా శాంసంగ్ విక్రయాలు కూడా తీవ్ర ఒత్తిడిని ఎదుర్కొన్నాయి.
Also Read : సోనియా ఆత్మకథతో సినిమా తీస్తా: జగ్గారెడ్డి
Follwo Us On: Whatsapp


