సోనియా ఆత్మకథతో సినిమా తీస్తా: జగ్గారెడ్డి

-

Alltimereport, Desk: సోనియా గాంధీ రాసిన ఆమె ఆత్మకథ ‘బిలాంగింగ్: ఏ జర్నీ ఆఫ్ లవ్’ ఆధారంగా ఒక అద్భుతమైన సినిమా తీస్తానంటూ తెలంగాణ పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి (Jagga Reddy) సంచలన ప్రకటన చేశారు. సోనియా గాంధీ జీవిత చరిత్రను ప్రజలకు సినిమా (Sonia Gandhi Biopic) రూపంలో చూపించాల్సిన అవసరం చాలా ఉందని, అప్పుడు చాలా నిజాలు ప్రజలకు తెలుస్తాయని అన్నారు. అందుకోసం కాంగ్రెస్ పార్టీ నాయకులు డబ్బులు రెడీ చేసుకోవాలని కూడా అన్నారు. సినిమాను ఒక ప్రత్యేక కమిటీ వేసి చర్చించి ప్రారంభిస్తానన్నారు. సోనియాది విజయవంతమైన రాజకీయ జీవితమన్నారు. తన సినిమాను సీఎం రేవంత్ రెడ్డి, టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ చేతుల మీదుగా ప్రారంభిస్తానన్నారు.

- Advertisement -

ఈ సినిమాకు సంగారెడ్డి కాంగ్రెస్ నేతలు, కార్యకర్తలే ప్రొడ్యూసర్లు అని చెప్పారు. సోనియా గాంధీ ఎప్పుడూ వ్యక్తిగత లాభాల కోసం చూసుకోలేదన్నారు. రాజీవ్ గాంధీ మరణం తర్వాత ప్రధాని అయ్యే అవకాశం ఉన్నా ఆమె పీవీ నరసింహరావును ఆ పీఠం ఎక్కించారని గుర్తు చేశారు. ఆ తర్వాత యూపీఏ ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా ప్రధాని పదవి కోసం ఆమె ప్రయత్నాలు చేయలేదని, అంతా ఆమే ప్రధాని కావాలని కోరుకున్నా ఆమె మాత్రం మన్మోహన్ సింగ్‌కు అవకాశం కల్పించారని అన్నారు. ఆమె తనను తాను కాదనుకుని ఎవరికి అయితే ప్రధాని పీఠం అందించారో వారంతా చరిత్రలో గుర్తుండిపోయే సంస్కరణలు తీసుకొచ్చారని జగ్గారెడ్డి (Jagga Reddy) అన్నారు.

Also Read : అర్ష్‌దీప్ సింగ్ నిశ్చితార్థం..

Follow Us on: X (Twitter)

Read more RELATED
Recommended to you

Latest news

Must read

తొందరేం లేదు.. కెప్టెన్సీపై ముంబై క్లారిటీ

Alltimereport, Desk: ఐపీఎల్ 2027 ముందు ముంబై ఇండియన్స్‌(Mumbai Indians)కు కెప్టెన్సీ...

దీపావళికీ పుంజుకోని స్మార్ట్‌ఫోన్ బిజినెస్

Alltimereport, Desk : దీపావళి పండగ సందర్భంగా దేశవ్యాప్తంగా భారీగా బిజినెస్...