అర్ష్‌దీప్ సింగ్ నిశ్చితార్థం..

-

Alltimereport, Desk : భారత బౌలర్ అర్ష్‌దీప్ సింగ్ (Arshdeep Singh) ఒక ఇంటివాడు కానున్నాడు. బుధవారం తన ప్రేయసి, సినీ నటి సమ్రీన్ కౌర్‌‌(Samreen Kaur)తో నిశ్చితార్థం చేసుకున్నాడు. ఈ విషయాన్ని సోషల్ మీడియా వేదికగా వెల్లడించాడు. ఆమెకు న్యూజిల్యాండ్‌లో ప్రపోజ్ చేశాడు. దానికి సంబంధించిన ఫొటోలను కూడా షేర్ చేసుకున్నాడు. ఈ ఫోటోలతో పాటు.. ‘జీవితం మాకు ఎన్నో ఇచ్చింది. కానీ ఒకరికి ఒకరిని ఇవ్వడం అన్నిటికన్నా ఎక్కువ ఆనందాన్ని ఇచ్చింది. ఈ ఆనందాన్ని జీవితంతా కాపాడుకుంటాం. చివరి వరకు కలిసే ఉంటాం’ అని పోస్ట్‌లో రాసుకొచ్చాడు.

- Advertisement -

అర్ష్‌దీప్ సింగ్ (Arshdeep Singh) పోస్ట్‌తో చాలా మంది అతని ప్రేయసి సమ్రీన్ ఎవరు? అని వెతికారు. అయితే ఆమె జమ్మూకశ్మీర్‌‌కు చెందిన నటి. 2018లో ఫెమినా మిస్ ఇండియా పోటీల్లో ఫైనలిస్ట్‌గా నిలిచింది. ఆ తర్వాత పలు కీలక సినిమాల్లో నటించింది. ఆమె చేసిన సినిమాల్లో ‘83, నెయిల్ పాలిష్’ ఉన్నాయి. వీటితో పాటు పలు పంజాబీ సినిమాల్లో కూడా ఆమె ప్రేక్షకులను అలరించారు. జూలై 26, 2026న అర్ష్‌దీప్ సింగ్.. ఆమెతో ఉన్న ఫొటోలను షేర్ చేసుకోవడంతో వీరి ప్రేమాయణం బయటకు వచ్చింది.

Also Read : ఆస్కార్ బరిలోకి ‘రామాయణ’..

Follow Us on: X (Twitter)

Read more RELATED
Recommended to you

Latest news

Must read

గ్రాండ్‌గా అనిరుధ్–కావ్య వివాహం

Alltimereport, Desk : యండ్ అండ్ డైనమిక్ మ్యూజిక్ కంపోజర్ అనిరుధ్,...

ఆస్కార్ బరిలోకి ‘రామాయణ’..

Alltimereport, Desk : విజువల్ వండర్‌గా ప్రేక్షకులను కట్టిపడేసిన ‘రామాయణ(Ramayana)’ ఇప్పుడు...