Alltimereport, Desk: ఐపీఎల్ 2027 ముందు ముంబై ఇండియన్స్(Mumbai Indians)కు కెప్టెన్సీ కష్టాలు వచ్చాయి. హార్దిక్ పాండ్యా(Hardik Pandya)ను పంజాబ్ కింగ్స్‌తో ట్రేడ్ చేసుకోవడంతో.. ఎంఐ తదుపరి కెప్టెన్ ఎవరు అన్న చర్చ మొదలైంది. దీనిపై అభిమానులు తమ అంచనాలను సోషల్ మీడియా వేదికగా షేర్ చేసుకుంటున్నారు. అయితే తాజాగా ఈ అంశంపై ఎంఐ ఫ్రాంఛైజీ స్పందించింది. కెప్టెన్ విషయంలో తాము తొందర పడాలనుకోవడం లేదని తేల్చి చెప్పింది. నింపాదిగా అన్ని అంశాలు చర్చించుకున్న తర్వాతనే నిర్ణయం తీసుకుంటామని తేల్చేసింది. దీంతో కెప్టెన్‌గా ఎవరికి బాధ్యతలు ఇవ్వాలన్న విషయంపై ముంబై తల పట్టుకుందుటుందన్న చర్చలకు తెరదించింది. కానీ ముంబైకి తదుపరి కెప్టెన్ ఎవరు అన్న చర్చ మాత్రం అంతే జోరుగా సాగుతోంది.
ఇందులో మరోసారి హిట్ మ్యాన్ రోహిత్ శర్మ (Rohit Sharma) మరఓసారి ముంబై పగ్గాలు అందుకుంటాడని వార్తలు వస్తున్నాయి. అతనితో పాటుగా కెప్టెన్ రేసులో తిలక్ వర్మ, సూర్యకుమార్ యాదవ్, జస్ప్రీత్ బుమ్రా కూడా ఉన్నట్లు కొందరు అంటున్నారు. అయితే ఏది ఏమైనా.. ఎలాంటి చర్చలు జరిగినా సమయం వచ్చినప్పుడు కెప్టెన్‌ను తాము ప్రకటిస్తామని ముంబై (Mumbai Indians) చెప్తోంది.
Also Read : అర్ష్‌దీప్ సింగ్ నిశ్చితార్థం..
Follow Us On: Whatsapp


