లేడీ సూపర్ స్టార్‌కు ప్లాప్‌లే ప్లాప్‌లు.. ‘రక్కాయి’పైనే ఆశలు..

-

Alltime Report, Desk : లేడీ సూపర్ స్టార్ నయనతార(Nayanthara)ను వరుస ప్లాప్‌లు వెంటాడుతున్నాయి. ఎంత క్రేజీ ప్రాజెక్ట్స్ చేసినా హిట్ మాత్రం అందని ద్రాక్ష పండులా మారింది. స్టార్ డబ్, క్రేజ్ అన్నీ ఉన్నా సినిమా థియేటర్‌లోకి వచ్చిన తర్వాత ప్రేక్షకులు మాత్రం రావడం లేదు. ఇటీవల నయనతార చేసిన అన్ని సినిమాలకు దాదాపు ఇదే ఫలితాలు వచ్చాయి. సోషల్ మీడియాలో, ప్రమోషన్స్ టైమ్‌లో క్రేజ్ పీక్స్‌లో ఉంది. కానీ థియేటర్లు మాత్రం ఖాళీగా వెలవెలబోయాయి. చివరకు సినిమా ప్లాప్ అనిపించుకుంది. ఇలా ఒక్క సినిమా కాదు.. ఇటీవల నయన్ చేసిన దాదాపు ప్రతి ప్రాజెక్ట్‌కు ఇదే వర్డిక్ట్ వచ్చింది. స్టార్ హీరోయిన్‌ అయినా తన మార్కెట్‌ను మాత్రం కాపాడుకోలేకపోతోంది ఈ భామ.

- Advertisement -

2026లో నయనతార (Nayanthara) నటించిన ‘మన శంకర్ వరప్రసాద్ గారు’ మినహా అన్ని సినిమాలు అంచనాలల్లో మినమ్ రేంజ్‌ను కూడా అందుకోలేకపోయాయి. ‘ మన శంకర్ వరప్రసాద్ గారు’ కూడా అంతంత మాత్రంగానే నిలిచింది తప్పితే హిట్ అనిపించుకోలేదు. ఆ తర్వాత భారీ అంచనాలతో వచ్చిన ‘మూకుర్తి అమ్మన్ 2‘ (మహాశక్తి) సినిమా అయితే బాక్సాఫీస్ దగ్గర బొక్కబోర్లా పడింది. ఈ సినిమా ఫస్ట్ పార్ట్‌ ఓటీటీలో బంపర్ హిట్ అనిపించుకోవడంతో సెకండ్ పార్ట్ తీశారు. కానీ రెండో పార్ట్ మాత్రం అట్టర్‌ ప్లాప్‌గా నిలిచింది. యష్ నటించిన ‘టాక్సిక్’ సినిమాలో కూడా నయన్ కీలక పాత్ర పోషించింది. ఆ సినిమా కూడా బాక్సాఫీస్ దగ్గర నిరాశ పరిచింది.

ఇలా వరుస ప్లాప్‌లు అమ్మడిని పలకరిస్తున్న సమయంలో ఆమె ఫ్యూచర్ ప్రాజెక్ట్స్ పరిస్థితి ఏంటి? ఆమెకు ఎవరు అవకాశాలు ఇస్తారు? ఈ భవిష్యత్ ప్లాన్స్ అయినా ఈ ప్లాప్ స్ట్రీక్‌కు బ్రేకులు వేస్తాయా? అన్న చర్చలు మొదలయ్యాయి. ప్రస్తుతం నయన్ చేతిలో.. ‘నయనతార 81, రక్కాయి, ధర్మన్’ సినిమాలు ఉన్నాయి. వీటిలో రక్కాయి మూవీపై లేడీ సూపర్ స్టార్ ఆశలు ఉన్నాయి. ఇందులో అదిరిపోయే యాక్షన్ సీక్వెన్స్‌తో ప్రేక్షకులను ఆకట్టుకోవడంలో సక్సెస్ అవుతానని భావిస్తోంది. ‘రక్కాయి’ నయన్‌ కెరీర్‌ను మలుపు తిప్పుతుందో చూడాలి.

Also Read : సూర్య రికార్డ్.. ఒకే ఏడాది మూడు బ్లాక్ బస్టర్‌లు!

Follow Us on: X (Twitter)

Read more RELATED
Recommended to you

Latest news

Must read

అదరగొట్టిన ఆర్యవీర్.. సెమీస్‌కు భారత్

Alltime Report, Desk: అండర్-19 ఆసియా కప్‌లో యూఏఈకి భారత్ చుక్కలు...

దోహాలో భారత్ దబడిదిబిడే.. ఒకే రోజు రెండు గోల్డ్ మెడల్స్

Alltime Report, Desk: దోహా వేదికగా జరుగుతున్న ప్రపంచ షూటింగ్ ఛాంపియన్‌షిల్‌(ISSF...