సూర్య రికార్డ్.. ఒకే ఏడాది మూడు బ్లాక్ బస్టర్‌లు!

-

Alltime Report, Desk : తమిళ స్టార్ యాక్టింగ్ హీరో సూర్య (Actor Surya) అరుదైన రికార్డ్‌కు అతి చేరువలో ఉన్నాడు. చాలా వరకు నటులు స్టార్‌డమ్ వచ్చిన తర్వాత ఒకే ఏడాది మూడు నాలుగు సినిమాలు చేయడం చాలా తక్కువ. ఒకవేళ నటించిన ఆ సినిమాలు అన్నీ హిట్ అవుతాయన్న గ్యారెంటీ లేదు. కానీ సూర్య మాత్రం ఈ రెండు ఫీట్‌లు అందుకోవడానికి అతి చేరువలో ఉన్నాడు. 2026లో సూర్య మూడు సినిమాల్లో నటిస్తే వాటిలో రెండు సినిమాలు ఇప్పటికే బ్లాక్ బస్టర్‌లు నిలిచాయి. మూడో సినిమా కూడా గ్రాండ్ సక్సెస్ దిశనగా కలెక్షన్స్ అందుకుంటోంది. దీంతో ఒకే ఏడాదిలో రూ.200 కోట్ల సంపాదించిన మూడు సినిమాల్లో నటించిన తమిళ హీరోగా ఘన సృష్టించడానికి రెడీగా ఉన్నాడు.

- Advertisement -

2026 మే నెలలో కరుప్పు(వీరభద్రుడు) సినిమాతో ప్రేక్షకుల ముందుకొచ్చిన సూర్య.. బాక్సాఫీస్ దగ్గర అదరగొట్టాడు. ఆ తర్వాత ఆగస్టు నెలలో ‘విశ్వనాథ్ అండ్ సన్స్’తో కూడా మంచి హిట్ అందుకున్నారు. ఇక ఇప్పుడు ‘సీన్’ సినిమాతో మరోసారి ప్రేక్షకుల ఆదరణ అందుకుంటున్నాడు. ఇప్పటికే ఈ సినిమాపై అభిమానులు, ప్రేక్షకులు కాసుల వర్షం కురిపిస్తున్నారు. ప్రపంచవ్యాప్తంగా కరుప్పు రూ.310 కోట్లు, విశ్వనాథ్ అండ్ సన్స్ రూ.209 కోట్లు, ‘సీన్’ ఇప్పటి వరకు రూ.154 కోట్లు సంపాదించాయి. అయితే సీన్ మూవీ రూ.200 మార్క్‌కు ఈజీగా అందుకునే అవకాశం ఉందని ఇండస్ట్రీ ఎక్స్‌పర్ట్స్ చెప్తున్నారు. ప్రస్తుతం అందుతున్న రెస్పాన్స్ చూస్తే ఈ వారం చివరకల్లా రూ.200 మార్క్‌ను అందుకోవచ్చని అంచనా వేస్తున్నారు. ఒకవేళ సీన్స్ మూవీ కూడా రూ.200 కోట్ల కలెక్షన్‌ను అందుకుంటే.. ఒకే ఏడాదిలో మూడు బ్లాక్ బస్టర్‌లు అందుకున్న హీరోగా సూర్య (Actor Surya) రికార్డ్ చేస్తాడు.

Also Read :  ఒత్తిడిని తగ్గించడానికి 27 మార్గాలు

Follow Us on: X (Twitter)

Read more RELATED
Recommended to you

Latest news

Must read

ఏపీ క్యాబినెట్ కీలక నిర్ణయాలు

Alltime Report, Desk: సీఎం చంద్రబాబు అధ్యక్షతన సమావేశమైన ఏపీ కేబినెట్...

దీపావళి లక్ష్మీ పూజ ప్రాశస్త్యం ఏంటో తెలుసా?

All Time Report Desk :   దీపావళి పండగ వచ్చిందంటే అందరూ...