కవిత నివాసంపై డ్రోన్ కలకలం

-

Alltime Report, Desk : తెలంగాణ రక్షణ సేన అధినేత్రి కల్వకుంట్ల కవిత (Kavitha) ఇంటి దగ్గర మంగళవారం సాయంత్రం హైటెన్షన్ నెలకొంది. హైదరాబాద్ బంజారాహిల్స్‌లోని ఆమె నివాసంపై గుర్తుతెలియని వ్యక్తులు డ్రోన్ (Drone) ఎగురవేయడమే ఇందుకు కారణం. ఈ ఘటన స్థానికంగా పెద్ద సంచలనంగా మారింది. ఈ అంశంపై పార్టీ శ్రేణులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. భద్రతా కారణ దృష్ట్యా కవిత కార్యాలయ సిబ్బంది వెంటనే స్పందించారు. ఈ ఘటనపై వారు బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్‌లో అధికారికంగా ఫిర్యాదు చేశారు. ప్రస్తుతం తెలంగాణ రాజకీయాల్లో కవిత ఇతర ప్రధాన పార్టీలకు దీటుగా వివిధ కార్యక్రమాలను వేగంగా నిర్వహిస్తున్నారు.

- Advertisement -

తెలంగాణ రాజకీయాల్లో తన మార్క్ చూపించడానికి ప్రయత్నాలు చేస్తున్నారు. అంతేకాకుండా కాంగ్రెస్, బీఆర్ఎస్ ప్రత్యామ్నాయంగా తమ పార్టీ నిలుస్తుందని ఆమె (Kavitha) దీమా వ్యక్తం చేస్తున్నారు. ఈ తరుణంలోనే ఆమె నివాసంపై డ్రోన్ ఎగరడం.. ప్రత్యర్థి రాజకీయ పార్టీలు ఆమెను లక్ష్యంగా చేసుకుని టార్గెట్ చేస్తున్నాయని పార్టీ శ్రేణులు బహిరంగంగా ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. కాగా, సిబ్బంది ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా పోలీసులు రంగంలోకి దిగి డ్రోన్ ఎగురవేసిన వారి కోసం దర్యాప్తు జరుపుతున్నారు. సంచలనం రేపిన ఈ ఘటనపై పూర్తి నిజానిజాలు విచారణ అనంతరం వెలుగులోకి రానున్నాయి.

Also Read : సూర్య రికార్డ్.. ఒకే ఏడాది మూడు బ్లాక్ బస్టర్‌లు!

Follow Us on: X (Twitter)

Read more RELATED
Recommended to you

Latest news

Must read

దోహాలో భారత్ దబడిదిబిడే.. ఒకే రోజు రెండు గోల్డ్ మెడల్స్

Alltime Report, Desk: దోహా వేదికగా జరుగుతున్న ప్రపంచ షూటింగ్ ఛాంపియన్‌షిల్‌(ISSF...

సూర్య రికార్డ్.. ఒకే ఏడాది మూడు బ్లాక్ బస్టర్‌లు!

Alltime Report, Desk : తమిళ స్టార్ యాక్టింగ్ హీరో సూర్య...