నలంద కిషోర్ మృతి పట్ల చంద్రబాబు, లోకేశ్ ట్వీట్స్

నలంద కిషోర్ మృతి పట్ల చంద్రబాబు, లోకేశ్ ట్వీట్స్

0
96

విశాఖలో తెలుగుదేశం పార్టీ అభిమాని నలంద కిషోర్ మృతి విచారకరం అని టీడీపీ అధినేత చంద్రబాబు అన్నారు. కేవలం సోషల్ మీడియాలో పోస్టు ఫార్వార్డ్ చేసినందుకు ప్రభుత్వం ఆయనపై కక్షగట్టి.. అక్రమ కేసు పెట్టి.. ఆరోగ్యం బాగాలేదని చెప్పినా, ఆయన వయసును కూడా లెక్కచేయకుండా విశాఖ నుంచి కర్నూలుకు తీసుకుపోయారని మండిపడ్డారు..

అంత అవసరం ఏమొచ్చింది.. ఆయనేమైనా తీవ్రవాదా అని చంద్రబాబు ప్రశ్నించారు… నలంద కిషోర్ మృతి కచ్చితంగా ప్రభుత్వం చేసిన హత్యే అని అన్నారు…. ఈ హత్యకు ప్రభుత్వమే బాధ్యత వహించాలని డిమాండ్ చేశారు… కిషోర్ కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నానని అన్నారు… ఆ కుటుంబానికి తెలుగుదేశం పార్టీ అన్ని వేళలా అండగా ఉంటుంది చెప్పారు…

అలాగే లోకేశ్ కూడా స్పందించారు.. నలంద కిషోర్ మృతి చాలా బాధాక‌రం అని అన్నారు… పార్టీ ఓ క్ర‌మ‌శిక్ష‌ణ క‌లిగిన నాయ‌కుడ్ని కోల్పోయిందని అన్నారు లోకేశ్… కిషోర్ కుటుంబస‌భ్యుల‌కు తన ప్రగాఢ‌ సంతాపం తెలియ‌జేస్తున్నానని అన్నారు…