చంద్రబాబుపై తీవ్రస్థాయిలో రెచ్చిపోయిన నాని

చంద్రబాబుపై తీవ్రస్థాయిలో రెచ్చిపోయిన నాని

0
96

ఏపీ రాజకీయాలు రసవత్తరంగా సాగుతున్నాయి… ఇటీవలే ఏపీ ముఖ్యమంత్రి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్ జగన్ మోహన్ రెడ్డి ఏపీలో మూడు రాజధానులు రావచ్చని ప్రకటించారు… దీనిపై మంత్రి కొడాలినాని స్పందించారు…

జగన్ చెప్పిందే ఫైనల్ అనుకుంటే ఎలా అని ప్రశ్నించారు… దీనిపై కమిటీ ఏర్పాటు చేశామని కమిటీ ప్రకారమే నిర్ణయం తీసుకుంటామని అన్నారు… చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ లు జగన్ ప్రకటన విషయంలో ఎవరితో చర్చించకుండా విమర్శలు చేస్తున్నారని ఆయన మండిపడ్డారు…

గత ఆరు నెలల నుంచి రాయలసీమలో హైకోర్టు ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తున్నారని… తీవ్రస్థాయిలో ఆందోళనలు చేశారని అప్పుడు చంద్రబాబు నాయుబు కోడిమీద ఈకలు పీకుతున్నారని కొడాలినాని సంచలన వ్యాఖ్యలు చేశారు… అలాగే బీజేపీ రాజ్యసభ సభ్యుడు సుజనా చౌదరిపై కూడా కొడాలి నాని ఫైర్ అయ్యారు… ఆయన మాటలు ఎవ్వరు పట్టించుకోవద్దని అన్నారు…