జూనియర్ ఎన్టీఆర్ పై లోకేష్ సంచలన వ్యాఖ్యలు..!!

జూనియర్ ఎన్టీఆర్ పై లోకేష్ సంచలన వ్యాఖ్యలు..!!

0
87

2009 ఎన్నికలు అనగానే గుర్తుకు వచ్చేది ఎన్టీఆర్. తెలుగుదేశం పార్టీ తరపున ఎన్నికల ప్రచారం లో తెలుగు రాష్ట్రాల్లో ఆయన సుడిగాలి పర్యటన చేశారు. ఈ ప్రయాణంలో ఎన్టీఆర్ ఎంతోమందిని కలుసుకుని కష్టసుఖాలు తెలుసుకున్నారు ఎన్టీఆర్ ని చూసిన అభిమానులు పెద్ద ఎన్టీఆర్ వచ్చినంత సంతోషపడ్డారు. దీంతో చిన్న ఎన్టీఆర్ రాజకీయాల్లోకి వస్తే అంతకంటే కావలసింది ఏముంది అన్ని సంబరపడ్డారు.

అయితే 2009 ఎన్నికలలో టిడిపి పార్టీ ఓడి పోయింది. పార్టీ ఓటమి అనంతరం జూనియర్ ఎన్టీఆర్ ను పక్కన పెట్టేశారు. దీంతో ఎన్టీఆర్ కూడా పార్టీకి దూరంగా ఉన్నారు. ఇక 2014 ఎన్నికల సమయంలో తెలుగుదేశం పార్టీ ఆంధ్రప్రదేశ్ లో విజయం సాధించింది. తెలంగాణలో మాత్రం సరైన నాయకత్వం లేక దారుణంగా పరాజయం పాలైంది తెలుగుదేశం పార్టీ తెలంగాణకు ఎన్టీఆర్ నీ అధ్యక్షుడిగా నియమించాలని అప్పుడే తెలంగాణలో పార్టీ మనుగడలోకి వస్తుందని అన్నారు కానీ అని అనుకున్నది ఒక్కటి అక్కడ జరిగింది మరొకటి ఎన్టీఆర్ తో పాటు హరికృష్ణను కూడా పక్కన పెట్టడం తో బాబు కుట్ర బయట పడింది. అయితే తెలుగుదేశం పార్టీ తాత స్థాపించిన పార్టీ కాబట్టి అవసరమైతే పార్టీలోకి వస్తాను అని గతంలో బాద్షా సినిమా సమయంలో ఎన్టీఆర్ చెప్పారు.

కట్ చేస్తే 2019 ఎన్నికల్లో టిడిపి ఆంధ్రప్రదేశ్లో ను దారుణంగా ఓటమిపాలైంది. రాష్ట్రంలో కేవలం 23 స్థానాల్లో మాత్రమే విజయం సాధించింది. ఇప్పుడు కూడా ఎన్టీఆర్ నీ రాజకీయం లోకి తీసుకురావాలని అనుకున్నారు తెలుగుతమ్ముళ్లు కానీ బాబు పట్టించుకోలేదు. బాలకృష్ణ అల్లుడు కూడా అవసరం లేదు అన్నట్టు వ్యవహరించారు. అయితే ప్రస్తుత రాజకీయాల గురించి లోకేశ్ను అడిగితే వ్యక్తిగతంగా పార్టీ ఎవరికి సపోర్ట్ చెయ్యదు అన్నాడు లోకేష్. దీంతో లోకేష్ వ్యాఖ్యలపై ఎన్టీఆర్ అభిమానులు ఆగ్రహంగా ఉన్నారు