టిడిపి పార్టీ కార్యకర్తలపై వైసిపి కార్యకర్తలు రాక్షసంగా దాడులు చేస్తున్నారంటూ టిడిపి పార్టీ అధినాయకత్వం ఆగ్రహం వ్యక్తం చేస్తోంది.. తాజాగా నారా లోకేష్ ట్విట్టర్లో ఘాటుగా స్పందించారు. పుట్టపర్తి నియోజకవర్గం నల్ల సముద్రం గ్రామానికి చెందిన టిడిపి కార్యకర్తలపై రాళ్లతో దాడి చేశారంటూ మండిపడ్డారు.
జగన్ గారు మీరు వంద రోజుల పాలనా పూర్తిచేసుకున్న సందర్భంగా వైసీపీ మృగాలు తమ 500వ దాడి ని మీకు అంకితం చేశారు. గత ఐదేళ్లలో ఏపీ పచ్చగా కళకళ లాడింది. ఇవాళ జగన్ తుగ్లక్ పాలనలో నెత్తురోడుతుంది అన్నారు. టిడిపి కార్యకర్తలు రక్తం చూడందే వైసీపీ కార్యకర్తలకు నిద్ర పట్టదు అనుకుంటా.. కనీసం ఇప్పటికైనా ఈ మారణహోమం ఆపేయండి. లేదంటే ఫలితం అనుభవిస్తారు. అంటూ నారా లోకేష్ హెచ్చరించారు.