నారాలోకేశ్ కు బంపర్ ఆఫర్ ప్రకటించిన వైసీపీ సర్కార్…

నారాలోకేశ్ కు బంపర్ ఆఫర్ ప్రకటించిన వైసీపీ సర్కార్...

0
93

తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ కు అధికార వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ బంపర్ ఆఫర్ ప్రకటించింది… అది చేస్తే వైసీపీ ఎమ్మెల్యే ఒకరు రాజకీయాలనుంచి శాశ్వితంగా తప్పుకుంటానని అన్నారు… తాజాగా ప్రొద్దుటూరు ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. నారాలోకేశ్ తెలుగులో స్పష్టంగా విధ్వంసం అన్న పదాన్ని పలికితే తాను శాశ్వితంగా రాజకీయాలనుంచి తప్పుకుంటానని సవాల్ విసిరారు…

లోకేశ్ ప్రజా క్షేత్రంలో మొఖం చాటేసి ట్విట్టర్ ద్వారా వాస్తవాలను వక్రీకరిస్తూ ప్రభుత్వంపై బురదజల్లే పనిని పెట్టుకున్నారని అయితే వీటిని ప్రజలు విశ్వసించే స్థితిలో లేరన్నారు.. ప్రత్యక్షఎన్నికల్లో ప్రజలచే తిరస్కరించ బడ్డ వ్యక్తి తమ ప్రభుత్వాన్ని విమర్శలు చేయడం విడ్డూరం అని అన్నారు…

ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి సుదీర్ఘ ప్రజా సంకల్పయాత్ర ద్వారా ప్రజల కష్టాలను కళ్లారా చూసి స్వయంగా తెలుసుకుని అధికారంలోకి వచ్చిన మరుక్షణమే సమాజంలోని అన్ని వార్గాల ప్రజలకు ప్రయోజనం కలిగే విధంగా విజయవంతంగా అమలు చేస్తున్నారని తెలిపారు… రాజకీయాలతో కూడిన విమర్శలు చేయాలి తప్ప బురదజల్లే విమర్శలు చేయకూడదని అన్నారు… అభివృద్ది దిశగా పని చేస్తున్న వైసీపీ ప్రభుత్వాన్ని చూసి టీడీపీ నేతలు ఓర్వలేకున్నారని ఆరోపించారు…