రంగంలోకి లోకేశ్ ఏం జరుగుతోంది….

రంగంలోకి లోకేశ్ ఏం జరుగుతోంది....

0
101

మానవ హక్కుల సంఘం బృందం రాష్ట్రానికి వచ్చిన తరువాత కూడా వైసీపీ నాయకులకు బుద్ధి మారడం లేదని మాజీ మంత్రి లోకేశ్ ఆరోపించారు…. టీడీపీకి ఓటు వేసారు అన్న అక్కసుతో 60 మంది ఎస్సీ కుటుంబాలను గ్రామం నుండి వెలివెయ్యాలి అని ప్రయత్నిస్తున్నారని లోకేశ్ ఆగ్రహం చెందారు

మహిళల్ని అసభ్య పదజాలంతో వేధించడం, హీరోయిజం అన్నట్టు వైసీపీ నాయకులు ఫీల్ అవుతున్నారని ఆయన ఆరోపించారు. స్వయంగా హోంమంత్రి నియోజకవర్గం ముట్లూరు గ్రామంలో ఈ పరిస్థితి ఉంది అంటే రాష్ట్రంలో శాంతి, భద్రతల పరిస్థితి ఏంటో అర్థం అవుతుందని లోకేశ్ అన్నారు…

గ్రామస్తుల న్యాయపోరాటానికి టీడీపీ అండగా ఉంటుందని తెలిపారు. త్వరలోనే పార్టీ బృందం గ్రామంలో పర్యటిస్తుందని తెలిపారు. పరిస్థితిని వీలైనంత త్వరగా చక్కదిద్దకపోతే స్వయంగా నేనే గ్రామానికి వస్తానని హామీ ఇచ్చారు లోకేశ్…