ఏపీ మాజీ ముఖ్యమంత్రి తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు కుమారుడు నారా లోకేశ్ కొద్దిసేపటి క్రితం జైలుకు వెళ్లారు… రాజధాని అమరావతి ప్రాంతంలో కొద్దికాలంగా నిరసన కార్యక్రమాలు చేస్తున్న సంగతి తెలిసిందే…
ఈ నిరసన కార్యక్రమాలు చేస్తున్న రైతులను పోలీసులు అరెస్ట్ చేసి జైల్లో ఉంచారు… తాజాగా వారిని పరామర్శించేందుకు లోకేశ్ జైలుకు వెళ్లారు.. ఆయనతోపాటు ఎంపీ గల్లా జయదేవ్, జీవీ ఆంజనేయులు, పత్తిపాటి పుల్లారావు. శ్రావణ్ కుమార్ నక్కా ఆనందబాబు కూడా రైతులను పరామర్శించి వారికి దైర్యాన్ని నింపారు…
కాగా ఇటీవలే మీడియాపై దాడి చేసిన వారిని కూడా పోలీసులు అరెస్ట్ చేశారు.. వారుకూడా ప్రస్తుతం జైల్లోనే ఉన్నారు… కాగా కొద్దికోజుల క్రితం వీరిని చంద్రబాబు నాయుడు పరామర్శించిన సంగతి తెలిసిందే…