ప్రధాని నరేంద్ర మోడీ చే రామ మందిరం భూమి పూజ

ప్రధాని నరేంద్ర మోడీ చే రామ మందిరం భూమి పూజ

0
78

శ్రీరాముడు దేవాలయం భూమి పూజలు వచ్చే నెల 5 వ తేదీన నిర్వహించేందుకు రామజన్మభూమి తీర్థ ట్రస్టు సిద్ధవుతోంది. ఆగస్టు 5 వ తేదీన ఉత్తర ప్రదేశ్ లో ప్రధాని నరేంద్రమోదిీ పర్యటన పురస్కరించుకొని అదే రోజు రామాలయానికి భూమి పూజ చేపట్టాలని రామజన్మ భూమి తీర్థ ట్రస్టు నిర్ణయించింది. దీనిపై చర్చించేందుకు ఈ నెల 18 న రామజన్మభూమి తీర్థ ట్రస్టు సభ్యులు సమావేశం కానున్నారు.అయోధ్య నిర్మించ తలపెట్టిన శ్రీరాముడు ఆలయం భూమిపూజకు రావాల్సిందిగా ఇప్పటికే ట్రస్టు సభ్యులు ప్రధాని నరేంద్ర మోదీని కోరారు.

ఆ మేరకు అధికారులు ప్రధాని పర్యటన ఖరారు చేసినట్టు సమాచారం. కరోనా వైరస్ వ్యాప్తి నేపథ్యంలో భూమిపూజ కార్యక్రమాన్ని సాదాసీదాగా నిర్వహించాలని ట్రస్టు నిర్ణయించింది. ఈ రోజు సమావేశమై భూమిపూజ తేదీని ట్రస్టు ప్రకటించింది. ట్రస్టు సమావేశానికి ముందు భవన నిర్మాణ నిపుణులతో, సన్యాసులతో కూడా భూమి పూజ తేదీపై చర్చించనున్నారు.

అయోధ్య రామాలయం భూమి పూజా కార్యక్రమానికి ప్రధాని మోదీ వచ్చే నెల 3 లేదా 5 న హాజరవుతారని ట్రస్ట్ అధ్యక్షుడు సంత్ నిత్య గోపాల్ దాస్ చెప్పారు.